ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పట్టుదలతో చదివితే ఉత్తమ ఫలితాలు

ABN, Publish Date - Jun 10 , 2025 | 12:37 AM

పట్టుదలతో చదివితే చక్కని ఫలితాలు సాధ్యమని కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక వీఆర్‌ ఫంక్షన్‌ హాల్లో సోమవారం నిర్వహించిన టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థుల ప్రతిభా అవార్డుల పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

బాలికలకు చెక్‌, ప్రశంసాపత్రం అందిస్తున్న కలెక్టర్‌ దినే శ్‌కుమార్‌, పక్కన మాజీ ఎమ్మెల్యే గిడ్డిఈశ్వరి

కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

జిల్లాలో 91 మంది టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థులకు ప్రతిభా అవార్డులు

పాడేరు జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): పట్టుదలతో చదివితే చక్కని ఫలితాలు సాధ్యమని కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక వీఆర్‌ ఫంక్షన్‌ హాల్లో సోమవారం నిర్వహించిన టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థుల ప్రతిభా అవార్డుల పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉజ్వల భవిష్యత్తు విద్యతోనే సాధ్యమని, రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యమిస్తుందన్నారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రభుత్వం నగదు బహుమతి, పతకం, ప్రశంసాపత్రాలతో సత్కరిస్తుందన్నారు. తలిదండ్రులు తమ పిల్లల బలాలు, బలహీనతలపై దృష్టిపెట్టాలని సూచించారు. విద్యార్థులకు కేరీర్‌ గైడెన్స్‌పై అవగాహన కల్పిస్తామని, ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించి నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ మాట్లాడుతూ టెన్త్‌, ఇంటర్‌ చదువులే విద్యార్థుల దశ దిశ మారుస్తాయన్నారు. విద్యతో పాటు కళలు, క్రీడల్లోనూ ప్రతిభ కనబరచి విద్యార్థులు ఉన్నతంగా రాణించాలన్నారు. పాఠశాలల్లో మార్గదర్శి కార్యక్రమాన్ని అమలు చేసి ఉన్నత చదువులపై విద్యార్థులకు మరింత అవగాహన కల్పిస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాకాలను సద్వినియోగం చేసుకుని సమాజంలో ఉన్నతంగా ఎదగాలన్నారు. సబ్‌కలెక్టర్‌ శౌర్యమన్‌పటేల్‌, జనసేన నేత వంపూరు గంగులయ్య, తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా చక్కని ఫలితాలు సాధించిన 72 మంది టెన్త్‌, 19 మంది ఇంటర్‌ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20 వేలు చెక్కు, ప్రశంసాపత్రం, మెడల్‌ను అధికారులు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మజీరావు, సర్వశిక్షా ఏపీసీ స్వామినాయుడు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎల్‌.రజని, ఇంటర్మీడియట్‌ జిల్లా అధికారి ఎస్‌.భీమశఽంకరరావు, జీసీసీ డైరెక్టర్‌ బొర్రా నాగరాజు, ఎంపీపీ ఎస్‌.రత్నకుమారి, పలువురు ఎంఈవోలు, హెచ్‌ఎంలు, టీచర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2025 | 12:37 AM