ఏపీఈఏపీ సెట్ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ
ABN, Publish Date - Jun 09 , 2025 | 01:16 AM
రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీ సెట్-2025 ఫలితాల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.
అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఏడో ర్యాంకు సాధించిన లక్ష్మీ చరణ్
రాష్ట్ర స్థాయిలో టాప్ వందలో చోటు దక్కించుకున్న పలువురు విద్యార్థులు
విశాఖపట్నం, జూన్ 8 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీ సెట్-2025 ఫలితాల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ పరీక్షకు జిల్లా నుంచి వేలాది మంది విద్యార్థులు హాజరవ్వగా, తాజాగా వెలువడిన ఫలితాల్లో పలువురు విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మెరుగైన ర్యాంకులను సాధించి సత్తా చాటారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఫలితాల్లో చినవాల్తేరుకు చెందిన గిరడా లక్ష్మీచరణ్ 91.31 స్కోరుతో రాష్ట్ర స్థాయిలో ఏడో ర్యాంకు సాధించాడు. ఇంజనీరింగ్ ఫలితాల్లో సీతమ్మధార ప్రాంతానికి చెందిన దిగుమర్తి గణ సాయిధర్మ ప్రతాప్ 88.87 స్కోరుతో రాష్ట్ర స్థాయిలో 47వ ర్యాంకు సాధించగా, జిల్లా స్థాయిలో టాపర్‌గా నిలిచాడు. అలాగే సీతమ్మధారకు చెందిన వారణాసి లక్ష్మీనారాయణ నిఖిలేశ్ 88.43 స్కోరుతో జిల్లా స్థాయిలో రెండో ర్యాంకు (రాష్ట్ర స్థాయిలో 54), కొమ్మాది ప్రాంతానికి చెందిన ఆదివిష్ణు సుబ్రహ్మణ్యం పెద్దిబొట్ల 86.60 స్కోరుతో మూడో ర్యాంకు (రాష్ట్ర స్థాయిలో 80) సాధించాడు. అలాగే భీమిలి పరిధిలోని తాళ్లవలసకు చెందిన ఎన్.ఉదయ్‌పవన్ 85.23 స్కోర్‌తో నాలుగో ర్యాంకు (రాష్ట్ర స్థాయిలో 104), కూర్మన్నపాలెం ప్రాంతానికి చెందిన నెమ్మాది ఆకాశ్ 85.08 స్కోరుతో ఐదో ర్యాంకు (108), సీతమ్మధారకు చెందిన రెబ్బా ప్రగడ సత్య శుృతీష్ 83.85 స్కోరుతో ఆరు (124), గోపాలపట్నం ప్రాంతానికి చెందిన వంగపండు గీతమ్‌కుమార్ నాయుడు 83.48 స్కోరుతో ఏడో ర్యాంకు (131) సాధించారు. అదేవిధంగా కూర్మన్నపాలెం ప్రాంతానికి చెందిన నీరుకొండ హిమవెంకట శ్రీకార్తికేయ 83.44 స్కోరుతో ఎనిమిదో ర్యాంకు (రాష్ట్ర స్థాయిలో 134), అక్కయ్యపాలేనికి చెందిన వల్లభవాజుల కాశ్యప్ 82.91 స్కోరుతో తొమ్మిది (రాష్ట్ర స్థాయిలో 152), తాళ్లవలసకు చెందిన డోకి జయవర్ధన్ 82.66 స్కోరుతో పదో (రాష్ట్ర స్థాయిలో 158) ర్యాంకు సాధించి సత్తా చాటారు.
అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో ర్యాంకర్లు వీరే..
అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలోనూ పలువురు విద్యార్థులు మెరుగైన స్కోరు సాధించి సత్తా చూపారు. గాజువాకకు చెందిన గురుకీర్తన 88.31 స్కోర్‌తో రెండో ర్యాంకు (రాష్ట్ర స్థాయిలో 34) సాధించగా, పెదగంట్యాడకు చెందిన కుందనేశ్వరి గొందేశి 87.61 స్కోరుతో మూడో ర్యాంకు (రాష్ట్ర స్థాయిలో 46) సాధించింది. అలాగే గాజువాకకు చెందిన యలవర్తి సాయి సిద్ధార్థ 86.54 స్కోరుతో నాలుగో (రాష్ట్ర స్థాయిలో 61) ర్యాంకు, సింహాచలం ప్రాంతానికి చెందిన సతి జయశృతి 86.10 స్కోరుతో ఐదో (రాష్ట్ర స్థాయిలో 70) ర్యాంకు, వేపగుంటకు చెందిన మూల వెంకట సాయికృష్ణ 84.87 స్కోరుతో ఆరు (92), మద్దిలపాలేనికి చెందిన గొట్టిపల్లి శృతిహాసిని 84.16 స్కోరుతో ఏడో (105) ర్యాంకు, గాజువాకకు చెందిన గొలగాని తేజేశ్ 82.35 స్కోరుతో ఎనిమిది (145), మాధవధారకు చెందిన చింటాడ రిషిత 81.65 స్కోరుతో తొమ్మిది (176), అక్కయ్యపాలేనికి చెందిన శొంఠి నాగలలిత శ్రావ్య 81.38 స్కోరుతో పదో ర్యాంకు (రాష్ట్ర స్థాయిలో 181) సాధించారు.
భారీగా హాజరైన విద్యార్థులు
ఏపీఈఏపీ సెట్‌కు జిల్లాకు చెందిన వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 32,026 మంది దరఖాస్తు చేసుకోగా 30,505 (95.25 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 22,111 (72.48 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో ప్రవేశాలకు సంబంధించిన పరీక్షకు 9,137 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 8,340 (91.27 శాతం) మంది హాజరయ్యారు. వీరిలో 7,411 (88.86 శాతం) మంది విద్యార్థులు అర్హత సాధించారు.
Updated Date - Jun 09 , 2025 | 01:16 AM