వీధి కుక్క దాడి: 8 మంది చిన్నారులకు గాయాలు
ABN, Publish Date - Jun 19 , 2025 | 12:23 AM
జీవీఎంసీ 70వ వార్డులో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఎనిమిది మంది చిన్నారులపై ఓ కుక్క దాడి చేసి గాయపరిచింది.
ఆటోనగర్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ 70వ వార్డులో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఎనిమిది మంది చిన్నారులపై ఓ కుక్క దాడి చేసి గాయపరిచింది. టీవీఎస్ కాలనీకి చెందిన అయ్యన్ (6)కు ఎడమ కంటి వద్ద, శ్రీనివాస నగర్‌కు కావ్యకు (2) ఎడమ చేతి భుజంపై గాయాలయ్యాయి. అలాగే మరో ఆరుగురు చిన్నారులను కుక్క కరవడంతో వారిని తల్లిదండ్రులు తక్షణమే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వార్డులో కుక్కల బెడద అధికమైందని జీవీఎంసీ, సచివాలయ అధికారులుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Updated Date - Jun 19 , 2025 | 12:23 AM