ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

లోసింగిలో స్కూల్‌ ఏర్పాటుకు చర్యలు

ABN, Publish Date - Jun 28 , 2025 | 12:46 AM

మండలంలోని అర్ల పంచాయతీ శివారు గిరిజన గ్రామం లోసింగిలో పాఠశాలను ఏర్పాటు చేసి, విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యా శాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు చెప్పారు. ‘బడికి వెళ్లాలంటే పది కిలోమీటర్లు నడవాల్సిందే’ అన్న శీర్షికన శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి డీఈఓ స్పందించారు. ఉదయం రోలుగుంట మండల కేంద్రానికి చేరుకున్న ఆయన తహసీల్దార్‌ నాగమ్మ, ఎంపీడీఓ నాగేశ్వరరావు, ఎంఈఓ జాన్‌ప్రసాద్‌, తదితరులతో కలిసి వాహనాల్లో వై.బి.పట్నం వెళ్లారు.

లోసింగిలో గిరిజన విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈఓ అప్పారావు నాయుడు,

డీఈఓ అప్పారావు నాయుడు

కొండలపై నడుచుకుంటూ గ్రామానికి వెళ్లిన అధికారులు

‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్‌

రోలుగుంట, జూన్‌ 27 (ఆంఽధ్రజ్యోతి): మండలంలోని అర్ల పంచాయతీ శివారు గిరిజన గ్రామం లోసింగిలో పాఠశాలను ఏర్పాటు చేసి, విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యా శాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు చెప్పారు. ‘బడికి వెళ్లాలంటే పది కిలోమీటర్లు నడవాల్సిందే’ అన్న శీర్షికన శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి డీఈఓ స్పందించారు. ఉదయం రోలుగుంట మండల కేంద్రానికి చేరుకున్న ఆయన తహసీల్దార్‌ నాగమ్మ, ఎంపీడీఓ నాగేశ్వరరావు, ఎంఈఓ జాన్‌ప్రసాద్‌, తదితరులతో కలిసి వాహనాల్లో వై.బి.పట్నం వెళ్లారు. అక్కడి నుంచి కొండలపైన ఉన్న లోసింగి గ్రామానికి నడుచుకుంటూ వెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక గిరిజనులతో మాట్లాడారు. గతంలో ఇక్కడ నివాసేతర ప్రత్యేక శిక్షణ కేంద్రం (స్కూల్‌) ఉండేదని, కానీ కొంతకాలం తరువాత ఎత్తేశారని గిరిజనులు తెలిపారు. లోసింగి, కొత్తలోసింగి, పాత లోసింగి గ్రామాల్లో బడికి వెళ్లే పిల్లలు 30 మంది వరకు వున్నారని, రోజూ ఐదు కిలోమీటర్ల దూరంలో వున్న వై.బి.పట్నం పాఠశాలకు వెళ్లిరావడానికి ఇబ్బందిగా వుండడంతో పలువురు చదువుకు దూరమయ్యారని చెప్పారు. డీఈఓ అప్పారావునాయుడు స్పందిస్తూ.. నివాసేతర ప్రత్యేక శిక్షణ కేంద్రం (స్కూల్‌) సెప్టెంబరులో పునఃప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Updated Date - Jun 28 , 2025 | 12:46 AM