ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పాము కాటుతో ఉక్కు ఉద్యోగి మృతి

ABN, Publish Date - Jun 24 , 2025 | 12:07 AM

ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిని పాము కాటు వేయడంతో మృతి చెందిన సంఘటన స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌లో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.

మృతి చెందిన శ్రీనివాస్‌

ఉక్కుటౌన్‌షిప్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిని పాము కాటు వేయడంతో మృతి చెందిన సంఘటన స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌లో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. స్టీల్‌ ప్లాంట్‌ ట్రాఫిక్‌ విభాగంలో జనరల్‌ ఫోర్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న టి.శ్రీనివాస్‌ (59) సెక్టార్‌-11లోని ఓ క్వార్టర్స్‌లో గ్రౌండ్‌ ఫ్లోరులో కుటుంబంతో ఉంటున్నారు. తెల్లవారుజామున పాము కాటు వేసినట్టు అనిపించడంతో ఆయన ఉక్కు జనరల్‌ ఆస్పత్రికి వెళ్లారు. అయితే అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. స్టీల్‌ ప్లాంట్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా శ్రీనివాస్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 12:07 AM