ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

స్టీల్‌ ప్లాంట్‌ కాంట్రాక్టు కార్మికుడి మృతి

ABN, Publish Date - Jun 17 , 2025 | 07:43 PM

స్టీల్‌ ప్లాంట్‌ కోక్‌ ఓవెన్‌ బ్యాటరీ విభాగంలో పైనుంచి జారిపడడంతో ఓ కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.

మృతుడు కేవీ రమణ (ఫైల్‌ ఫొటో)

కోక్‌ ఓవెన్‌ బ్యాటరీ విభాగంలో పనిచేస్తూ 50 మీటర్ల ఎత్తు నుంచి పడడంతో దుర్ఘటన

ఉక్కుటౌన్‌షిప్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): స్టీల్‌ ప్లాంట్‌ కోక్‌ ఓవెన్‌ బ్యాటరీ విభాగంలో పైనుంచి జారిపడడంతో ఓ కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. గాజువాక సమీపంలోని నక్కవానిపాలేనికి చెందిన కేవీ రమణ (53) కోక్‌ ఓవేన్‌ విభాగంలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం 50 మీటర్ల ఎత్తులో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. తక్షణమే సహచర కార్మికులు స్టీల్‌ ప్లాంట్‌ ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌కు, అక్కడ నుంచి కేజీహెచ్‌కు తరలించారు. అయితే అప్పటికే రమణ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు స్టీల్‌ ప్లాంట్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా భద్రతా లోపం వల్లే కారట్రాక్టు కార్మికుడు మృతి చెందాడని కార్మిక నాయకులు ఆరోపిస్తున్నారు.

Updated Date - Jun 17 , 2025 | 07:43 PM