ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గంజాయిపై ప్రత్యేక నిఘా

ABN, Publish Date - May 20 , 2025 | 11:17 PM

గంజాయి రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టాలని జిల్లా ఎస్పీ అమిత్‌బర్దార్‌ పోలీసులను ఆదేశించారు.

పోలీస్‌ స్టేషన్‌లో రికార్డులను పరిశీలిస్తున్న ఎస్పీ అమిత్‌బర్దార్‌

అనంతగిరి పోలీసులకు ఎస్పీ అమిత్‌బర్దార్‌ ఆదేశం

తరచూ వాహనాల తనిఖీలు చేయాలి

ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా నడుచుకోవాలి

యువత ఉద్యోగ అవకాశాలపై దృష్టిసారించాలి

అనంతగిరి, మే 20 (ఆంధ్రజ్యోతి): గంజాయి రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టాలని జిల్లా ఎస్పీ అమిత్‌బర్దార్‌ పోలీసులను ఆదేశించారు. మంగళవారం ఆయన అనంతగిరి పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత రికార్డులు, స్టేషన్‌ నిర్వహణపై పరిశీలించారు. కేసులు వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనంతగిరి మీదుగా మైదాన ప్రాంతాలకు గంజాయి తరలించే అవకాశం ఉందని, పోలీస్‌ సిబ్బంది ఎప్పటికప్పుడు వాహనాల తనిఖీలను నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. అలాగే పర్యాటక ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాలని, ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. ఘాట్‌రోడ్డు ప్రయాణంపై వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలలు, కళాశాలల వద్ద మాదకద్రవ్యాల సేవించడంపై జరిగే అనర్ధాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. గిరిజన యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ.. ఉద్యోగ అవకాశాలపై దృష్టిసారించాలని, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట పాడేరు డీఎస్పీ షెహబాజ్‌, అరకు సీఐ హిమగిరి, అనంతగిరి ఎస్‌ఐ డీ.శ్రీనివాసరావు, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

Updated Date - May 20 , 2025 | 11:17 PM