ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రెండు పంచాయతీలకు స్పెషల్‌ గ్రేడ్‌ హోదా

ABN, Publish Date - May 16 , 2025 | 12:31 AM

పంచాయతీ వ్యవస్థను పటిష్ఠపరిచేందుకు రాష్ట్ట ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగా గ్రామ పంచాయతీల హోదాలో మార్పులు చేశారు.

  • జిల్లాలోని గంభీరం, వేములవలస ఎంపిక

  • గ్రేడ్‌-1 నుంచి పలు పంచాయతీల తొలగింపు

  • రాష్ట్ర ప్రభత్వ సంస్కరణలతో మార్పులు

విశాఖపట్నం, మే 15 (ఆంధ్రజ్యోతి):

పంచాయతీ వ్యవస్థను పటిష్ఠపరిచేందుకు రాష్ట్ట ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగా గ్రామ పంచాయతీల హోదాలో మార్పులు చేశారు. ఆదాయం, జనాభా ఆధారంగా పంచాయతీల హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో జిల్లాలోని గంభీరం, వేములవలస గ్రామ పంచాయతీలకు స్పెషల్‌ గ్రేడ్‌ హోదా లభించింది. ఈ రెండు గ్రామ పంచాయతీలు ఏడాదికి సొంతంగా రూ.కోటి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. ఇంటి పన్ను, రిజిస్ట్రేషన్లు, సీనరేజ్‌ , వాణిజ్య సంస్థల నుంచి వసూలు చేసే పన్నులు రూ.కోటి దాటాలి. రాష్ట్రంలో పంచాయతీలకు స్పెషల్‌ గ్రేడ్‌ హోదా కల్పించడం ఇదే తొలిసారి. గంభీరం, వేములవలస గ్రామ పంచాయతీలు నగరానికి ఆనుకుని ఉండడంతో రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా స్టాంపు డ్యూటీ ఎక్కువగా వసూలవుతుంది. ఇంకా కొత్తగా ఏర్పాటువుతున్న అపార్టుమెంట్లు, వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, కళాశాలలు, పాఠశాలల నుంచి పన్నుల రూపంలో ఆదాయం వస్తోంది. ఆనందపురం జంక్షన్‌లో పూల మార్కెట్‌ మొత్తం వేములవలస పరిధిలో ఉండడంతో ఏడాదికి రూ. కోటికిపైగా ఆశీలు వసూలవుతుంది. ఇప్పటివరకు ఈ రెండు గ్రామ పంచాయతీలు గ్రేడ్‌-1 హోదాలో ఉన్నాయి. ఇప్పుడు స్పెషల్‌ గ్రేడ్‌ హోదా లభించడంతో పంచాయతీ కార్యదర్శిగా గజిటెడ్‌ హోదా ఉన్న అధికారిని నియమిస్తారు.

ఇదిలావుండగా జిల్లాలో 23 గ్రామ పంచాయతీలు ఇప్పటివరకు గ్రేడ్‌-1 హోదాలో ఉండగా, తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు పలు పంచాయతీలు ఆ హోదాను కోల్పోయాయి. గడిచిన మూడేళ్ల నుంచి గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి స్టాంపు డ్యూటీ విడుదలచేయలేదు. దీంతో పంచాయతీలు ఆదాయం కోల్పోడంతో మామిడిలోవ, గండిగుండం, గిడిజాల, శొంఠ్యాం, తర్లువాడ, కుసులవాడ, పెద్దిపాలెం, రాంపురం, వాలిమెరక, ఎస్‌ఆర్‌ పురం పంచాయతీలు గ్రేడ్‌-1 నుంంచి గ్రేడ్‌-2గా మారాయి. అయితే మామిడిలోవ పంచాయతీలో దబ్బందలో 1,900 టిడ్కో ఇళ్లను నిర్మించారు. దీంతో జనాభా ఐదు వేలకు చేరుకునే అవకాశం ఉన్నందున తిరిగి గ్రేడ్‌-1 హోదా అధికారులు అంచనా వేస్తున్నారు. స్టాంపు డ్యూటీ విడుదలైతే గిడిజాల, గండిగుండం, పెద్దిపాలెం, వాలిమెరక, ఎస్‌ఆర్‌ పురం, రాంపురం పంచాయతీలు గ్రేడ్‌-1 హోదాను నిలబెట్టుకుంటాయని అంటున్నారు. మండల కేంద్రాలను గ్రేడ్‌-1 పంచాయతీలుగా పరిగణించాలన్న ఆదేశాలతో పద్మనాభం పంచాయతీకి హోదా గ్రేడ్‌-1 దక్కనున్నది. కాగా పెందుర్తి కేంద్రం జీవీఎంసీలో ఉన్నందున మండల పరిషత్‌ కార్యాలయాన్ని సరిపల్లి కేంద్రంగా నిర్వహించాలని ప్రతిపాదించడవంతో సరిపల్లి కూడా గ్రేడ్‌-1గా కొనసాగే అవకాశం ఉంది. కొత్తగా పెదనాగమయ్యపాలెం పంచాయతీ గ్రేడ్‌-1 హోదాకు అప్‌గ్రేడ్‌ అయింది. పలు పంచాయతీల ఆదాయం పెరిగే అవకాశం ఉన్నందున గ్రేడింగ్‌ను తిరిగి పునరుద్ధరించాలన్న దానిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని జిల్లా పంచాయతీ అధికారి ఎంఎన్‌వీ శ్రీనివాసరావు తెలిపారు.

Updated Date - May 16 , 2025 | 12:31 AM