అధిక లోడుతో వస్తున్న లారీలపై ప్రత్యేక దృష్టి
ABN, Publish Date - May 15 , 2025 | 12:04 AM
అధిక లోడుతో రాకపోకలు సాగిస్తున్న లారీలపై ప్రత్యేక దృష్టి సారించాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సిబ్బందిని ఆదేశించారు. మాకవరపాలెం పోలీసు స్టేషన్‌ను బుధవారం ఆయన తనిఖీ చేశారు.
మాకవరపాలెంలో సామాజిక పింఛన్ల మాయం కేసు త్వరలో కొలిక్కి
ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో నిందితుల గుర్తింపు
జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడి
మాకవరపాలెం, మే 14 (ఆంధ్రజ్యోతి) : అధిక లోడుతో రాకపోకలు సాగిస్తున్న లారీలపై ప్రత్యేక దృష్టి సారించాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సిబ్బందిని ఆదేశించారు. మాకవరపాలెం పోలీసు స్టేషన్‌ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రసుత్తం రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయన్నారు. మాకవరపాలెంలో మూడేళ్ల క్రితం సామాజిక పింఛన్లకు సంబంధించిన రూ.16 లక్షలు మాయమైందన్నారు. ఈ ఘటనపై అప్పట్లో కేసు నమోదైనట్టు చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన నిందితులను ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో గుర్తించినట్టు స్పష్టం చేశారు. తర్వలోనే వారిని పీటీ వారెంట్ ద్వారా మాకవరపాలెం పోలీసు స్టేషనుకు తీసుకువచ్చి, ఇక్కడే కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామన్నారు. ఇక్కడున్న ప్రైవేటు కంపెనీకి అధిక లోడుతో వస్తున్న లారీలను తనిఖీ చేయాలని సీఐ రేవతమ్మను ఆదేశించారు. రాజమండ్రి నుంచి ఇసుక లారీలు వస్తున్నాయని, ఇసుక ఎగరకుండా వాటిపై పూర్తిగా పరజా ఉంచేలా అవగాహన కల్పించాలన్నారు. సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలన్నారు. సిబ్బంది ఎప్పటికప్పుడు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు, రూరల్ సీఐ రేవతమ్మ, స్థానిక ఎస్‌ఐ దామోదర్‌నాయుడు పాల్గొన్నారు.
Updated Date - May 15 , 2025 | 12:04 AM