పెండింగ్ కేసులపై ఎస్పీ సమీక్ష
ABN, Publish Date - May 18 , 2025 | 12:34 AM
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగంగా పూర్తి చేసి చార్జిషీట్లు వేయాలని పోలీస్ అధికారులను ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశించారు. శనివారం ఆయన ఎలమంచిలి సర్కిల్ కార్యాలయంతో పాటు రూరల్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు.
ఎలమంచిలి, మే 17 (ఆంధ్రజ్యోతి): పెండింగ్ కేసుల దర్యాప్తును వేగంగా పూర్తి చేసి చార్జిషీట్లు వేయాలని పోలీస్ అధికారులను ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశించారు. శనివారం ఆయన ఎలమంచిలి సర్కిల్ కార్యాలయంతో పాటు రూరల్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. పరవాడ డీఎస్పీ వి.విష్ణు స్వరూప్, స్థానిక సీఐ ధనుంజయరావు, ఎస్‌ఐలు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన పెండింగ్‌లో ఉన్న కేసులను సమీక్షించారు. తప్పించుకుని తిరుగుతున్న నిందితులను అరెస్టు చేయాలని, రోడ్డు ప్రమాదాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం స్టేషన్ రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డీఎస్‌పీ శ్రీకృష్ణ చైతన్య, ఎస్‌ఐలు ఉపేంద్ర, సావిత్రి, రామకృష్ణ, ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - May 18 , 2025 | 12:34 AM