ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

దుకాణాలకో దండం!

ABN, Publish Date - May 02 , 2025 | 01:06 AM

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) వాణిజ్య సముదాయాల్లో దుకాణాలకు డిమాండ్‌ తగ్గిపోతోంది.

  • వీఎంఆర్‌డీఏ షాపులకు పడిపోయిన డిమాండ్‌

  • భారీగా అద్దెలు పెంచడమే కారణం

  • వేలం నిర్వహించి అద్దె ఖరారుచేస్తున్న వైనం

  • చెల్లించలేక చేతులెత్తేస్తున్న వ్యాపారులు

  • సిబ్బందితో కుమ్మక్కై రూ.లక్షల్లో ఎగనామం

విశాఖపట్నం, మే 1 (ఆంధ్రజ్యోతి):

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) వాణిజ్య సముదాయాల్లో దుకాణాలకు డిమాండ్‌ తగ్గిపోతోంది. అద్దెలు ఎక్కువగా ఉండడమే అందుకు కారణమనే వాదన వినిపిస్తోంది. పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్న దుకాణాలను అద్దెకు ఇవ్వడానికి మే 13న వేలం నిర్వహిస్తామని వీఎంఆర్‌డీఏ ప్రకటన జారీచేసింది. వీఎంఆర్‌డీఏ దుకాణాలకు గతంలో డిమాండ్‌ ఉండేది. ప్రస్తుతం అద్దె మొత్తం తెలుసుకుని వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు.

నగరంలో నిర్ణీత ధర ప్రకారం చదరపు అడుగుకు రూ.30/40 చొప్పున తీసుకొని దుకాణాలను కేటాయించాల్సి ఉండగా, వేలం వేస్తున్నారు. ఆ సెంటర్‌లోనే వ్యాపారం చేయాలనుకునేవారు ఎక్కువ రేటుకు పాడుకొని దుకాణం దక్కించుకుంటున్నారు. సంపాదించినదంతా దుకాణం అద్దెకే సరిపోవడంతో తట్టాబుట్టా సర్దేస్తున్నారు. దుకాణం ఖాళీ అయిపోతోంది. కాగా అప్పటివరకు వచ్చిన అద్దెను అప్‌సెట్‌ ధరగా నిర్ణయించి వీఎంఆర్‌డీఏ మళ్లీ వేలం పెడుతోంది. పాత ధరే ఎక్కువ అంటే దానిని మళ్లీ వేలం ద్వారా పెంచేస్తున్నారు. ఎక్కువకు పాడుకున్న వారిలో కొందరు అసలు అద్దె కట్టకుండా బకాయి పెట్టి బిచాణా ఎత్తేస్తున్నారు. అద్దెలు వసూలు చేసే రెవెన్యూ విభాగంలో ఓ ఉద్యోగిని మచ్చిక చేసుకొని కొంతమొత్తం సర్దుబాటు చేసి అద్దె చెల్లించడం మానేస్తున్నారు. ఇలా నెలల తరబడి బకాయిలు పేరుకుపోతున్నాయి. వీటిని పర్యవేక్షించే నాథుడే కనిపించడం లేదు.

సీతమ్మధార రైతుబజారు సమీపంలోని వాణిజ్య సముదాయంలో ఫ్యాన్సీ వ్యాపారం చేసే వ్యక్తి రూ.కోటికి పైగా అద్దె బకాయి ఉన్నా అధికారులు చూసుకోలేదు. ఫిర్యాదులు అందడంతో యజమానిని బయటకు నెట్టి దుకాణం సీజ్‌ చేశారు. ఇది జరిగి రెండేళ్లయింది. ఇప్పటికీ ఆ దుకాణం ఖాళీగానే ఉంది. వేలం విధానంతో అద్దెలు భారంగా మారుతున్నా, అధికారులు పట్టించుకోవడం లేదు. దీనికి స్వస్తి పలికి నిర్ణీత ధర నిర్ణయించి, దరఖాస్తులు ఆహ్వానించి, లాటరీ ద్వారా దుకాణాలు కేటాయిస్తే మేలని వ్యాపారులు సూచిస్తున్నారు. దీనివల్ల అనారోగ్యకరమైన పోటీ తప్పుతుందంటున్నారు. వీఎంఆర్‌డీఏ వ్యాపార సంస్థలా మారడం, ఉద్యోగులు సొంత ప్రయోజనాలు చూసుకోవడంతో కనీస ఆదాయం రాకపోవడమే కాకుండా, రూ.లక్షల్లో అద్దె ఎగ్గొట్టే వారి సంఖ్య పెరుగుతోంది.

నగరంలో వీఎంఆర్‌డీఏకు చెందిన అనేక వాణిజ్య సముదాయాల్లో పదుల సంఖ్యలో దుకాణాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు తగు నిర్ణయం తీసుకుని, వేలం ప్రక్రియను పక్కనబెట్టి నిర్ణీత ధరకు అద్దెకు ఇస్తే దుకాణాలకు డిమాండ్‌ పెరగడంతో పాటు, సంస్థకు భారీగా ఆదాయం సమకూరుతుంది.

Updated Date - May 02 , 2025 | 01:06 AM