శారదా నది వ్యర్థాలమయం
ABN, Publish Date - May 24 , 2025 | 11:08 PM
అనకాపల్లి పట్టణానికి ఆనుకొని ఉన్న శారదా నది అధ్వానంగా తయారైంది. ఎక్కడబడితే అక్కడ వ్యర్థాలతో దారుణంగా ఉంది. ఈ నీరే పలు గ్రామాలకు సరఫరా అవుతుంటుంది. దీంతో వ్యాధులు ప్రబలుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
నీరు కలుషితం
వ్యాధులు ప్రబలుతాయని ప్రజల భయాందోళన
అనకాపల్లి టౌన్, మే 24 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి పట్టణానికి ఆనుకొని ఉన్న శారదా నది అధ్వానంగా తయారైంది. ఎక్కడబడితే అక్కడ వ్యర్థాలతో దారుణంగా ఉంది. ఈ నీరే పలు గ్రామాలకు సరఫరా అవుతుంటుంది. దీంతో వ్యాధులు ప్రబలుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పట్టణానికి చెందిన పలు హోటళ్ల నిర్వాహకులు, వ్యాపారులు వ్యర్థాలను రాత్రి వేళల్లో వంతెన పైనుంచి నదిలో పారబోస్తున్నా రు. ఈ వ్యర్థాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఈ నదిలో స్నానం చేస్తే చర్మవ్యాధులు వస్తాయని పలువురు భయపడుతున్నారు. శారదా నదిలో ఫిల్టర్ బావులు ఏర్పాటు చేసి వాటి ద్వారా పైపులైన్లతో సమీపంలోని పలు గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఈ నీరు కలుషితం కావడంతో వ్యాధులు వస్తాయని జనం భీతిల్లుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి నదిలో వ్యర్థాలు లేకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Updated Date - May 24 , 2025 | 11:08 PM