ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

లోక్‌ అదాలత్‌లో 1,114 కేసులు పరిష్కారం

ABN, Publish Date - Jul 06 , 2025 | 12:34 AM

ఎలమంచిలి కోర్టుల సముదాయం ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో 1,114 కేసులు పరిష్కారమైనట్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి పి.విజయ తెలిపారు.

ఎలమంచిలిలో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి పి.విజయ

ఎలమంచిలి, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ఎలమంచిలి కోర్టుల సముదాయం ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో 1,114 కేసులు పరిష్కారమైనట్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి పి.విజయ తెలిపారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి పి.విజయ, ప్రిన్సిపల్‌ సివిల్‌ జడ్జి జూనియర్‌ డివిజన్‌ జి.స్పందన, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.రమేశ్‌ల ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్‌ సివిల్‌ జడ్జి విజయ మాట్లాడుతూ ఒకే రోజు 1,114 కేసులు పరిష్కారమయ్యాయని, రాజీ పరిష్కారం నిమిత్తం వచ్చిన రుసుము కక్షిదారులకు చెల్లించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు టి.సత్యనారాయణ, లోక్‌ అదాలత్‌ సభ్యులు, ఏజీపీ డి.వెంకటరావు, లోక్‌ అదాలత్‌ మెంబరు పీవీ.రమణ, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2025 | 12:34 AM