ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ఎంపిక

ABN, Publish Date - Jul 29 , 2025 | 01:01 AM

వచ్చే నెలలో కాకినాడలో యోగాసన భారత్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు స్థానిక యోగా క్రీడాకారులు ఎంపికయ్యారు.

జిల్లా స్థాయి యోగా పోటీల్లో బంగారు పతకాలు సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు

చోడవరం, జూలై 28(ఆంధ్రజ్యోతి): వచ్చే నెలలో కాకినాడలో యోగాసన భారత్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు స్థానిక యోగా క్రీడాకారులు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో ఒమ్మి శ్యాంప్రసాద్‌, పొట్నూరు పవన్‌కుమార్‌, గొంతిన లయవర్ధన్‌, పందిరి వెన్నెలశ్రీ, మళ్ల శ్రీహితలతో పాటు యోగా గురువు పుల్లేటి సతీశ్‌ ఉన్నారు. కాగా ఆదివారం జిల్లాలోని పరవాడలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగాసన పోటీల్లో ఒమ్మి శ్యాంప్రసాద్‌ 14 ఏళ్లలోపు విభాగంలో బంగారు పతకం, 18 ఏళ్ల విభాగంలో పొట్నూరు పవన్‌, బ్యాక్‌ బెండింగ్‌ విభాగంలో గొంతిన లయవర్ధన్‌లు బంగారు పతకాలు సాధించారు. 18 ఏళ్లలోపు బాలికల విభాగంలో పందిరి వెన్నెలశ్రీ బంగారు పతకం సాధించగా, 28 సంవత్సరాల విభాగంలో మళ్ల శ్రీహిత బంగారు పతకం, 45ఏళ్లలోపు విభాగంలో పతంజలి యోగా కేంద్రం గురువు పుల్లేటి సతీశ్‌ బంగారు పతకాలు సాధించి సత్తాచాటారు. జిల్లా స్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన స్థానిక యోగా క్రీడాకారులను పలువురు అభినందించారు.

Updated Date - Jul 29 , 2025 | 01:01 AM