తాటిచెట్టు పైనుంచి జారిపడి సచివాలయ ఉద్యోగి మృతి
ABN, Publish Date - Apr 19 , 2025 | 12:50 AM
తాటిచెట్టు పైనుంచి జారిపడి సచివాలయ ఉద్యోగి మృతి
కోటవురట్ల, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అన్నవరంగ్రామంలో సచివాలయ ఉద్యోగి ఒకరు తాడిచెట్టు పైనుంచి జారిపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్‌ఐ రమేశ్ అందజేసిన వివరాల ప్రకారం.. అన్నవరం గ్రామానికి చెందిన పైల రాజేశ్ (23) మాకవరపాలెం మండలం జి.వెంకటాపురం సచివాలయంలో ఉద్వాన సహాయకునిగా ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం సెలవు కావడంతో స్నేహితులతో కలిసి తాటికాయలు కొట్టేందుకు చెట్టుఎక్కాడు. ఈ క్రమంలో కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. కోటవురట్ల ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషయంగా ఉండడంతో నర్సీపట్నం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Apr 19 , 2025 | 12:50 AM