ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కరకచెట్టు పోలమాంబకు సారె సమర్పణ

ABN, Publish Date - Jul 19 , 2025 | 12:37 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిఽధిలో పరీక్ష ఫలితాల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

పెదవాల్తేరు, జూలై 18 (ఆంధ్రజ్యోతి):

కరకచెట్టు పోలమాంబ అమ్మవారికి శుక్రవారం భారీ సారెను సమర్పించారు. అమ్మవారి పుట్టిల్లు మద్దివారిపెద్దిలు, పెదవాల్తేరు ఆదర్శనగర్‌తో పాటు శివాజీపాలెంలోని చినపోలమాంబ ఆలయం, చినవాల్తేరు శ్రీకనకమహాలక్ష్మి (దుర్గా) అమ్మవారి దేవాలయాల నుంచి మహిళలు పెద్దసంఖ్యలో సారెతో మేళతాళాలు, మంగళవాయిద్యాలతో పోలమాంబ ఆలయానికి చేరుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో కె.గాయత్రి, టీడీపీ నేతలు బైరెడ్డి పోతన్నరెడ్డి, బోట్ట వెంకటరమణ, పీతల అమరేంద్ర, ఒమ్మి అప్పారావు, సీహెచ్‌ జ్యోతి, కంభాపు శివారెడ్డి, భక్తులు పాల్గొన్నారు.


పరీక్ష ఫలితాల వెల్లడిలో జాప్యం

మూడు నెలల క్రితం డిగ్రీ రెండు, నాలుగో సెమిస్టర్లు, పీజీ ఆర్గానిక్‌ కెమిస్ర్టీ, దూరవిద్య పరీక్షల నిర్వహణ

ఇప్పటివరకూ ఫలితాలు వెల్లడించకపోవడంతో విద్యార్థుల ఆందోళన

మూల్యాంకనమే ప్రారంభించలేదని సమాచారం

విశాఖపట్నం, జూలై 18 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిఽధిలో పరీక్ష ఫలితాల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మూడు నెలల కిందట జరిగిన పరీక్షలకు సంబంధించిన ఫలితాలను అధికారులు ఇప్పటివరకూ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వీరిలో రెగ్యులర్‌ డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు దూర విద్యలో వివిధ కోర్సుల విద్యార్థులు ఉన్నారు.

సాధారణంగా ఏయూ పరిధిలో పరీక్షలు పూర్తయిన 45 రోజుల నుంచి రెండు నెలల్లో ఫలితాలను విడుదల చేస్తుంటారు. అయితే, ప్రస్తుతం విడుదల కావాల్సిన ఫలితాలకు సంబంధించిన పరీక్షలు పూర్తయి మూడు నెలలు దాటింది. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారిలో డిగ్రీ రెండో సెమిస్టర్‌, నాలుగో సెమిస్టర్‌ రాసిన విద్యార్థులతోపాటు పీజీ ఆర్గానిక్‌ కెమిస్ర్టీ పరీక్ష రాసినవారు ఉన్నారు. ఆయా పరీక్షలను ఈ ఏడాది ఏప్రిల్‌ రెండు, మూడు వారాల్లో నిర్వహించారు. పరీక్షలు జరిగి దాదాపు మూడు నెలలు కావస్తోంది. అయితే, ఇప్పటివరకూ మూల్యాంకనం ప్రక్రియనే ప్రారంభించలేదని తెలుస్తోంది. అలాగే, దూరవిద్యా కేంద్రం పరిధిలో నిర్వహించే డిగ్రీ, పీజీ కోర్సులకు సంబంధించిన పరీక్షలను ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించారు. ఆయా కోర్సుల్లో చేరిన సుమారు 25 వేల మంది పేపర్లను మూల్యాంకనం చేయాల్సి ఉంది. నెలలు గడుస్తున్నా పరీక్ష ఫలితాలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తాము రాసిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించామా?, లేదా?...అనే ఆందోళనతోపాటు పరీక్ష పత్రాలు భద్రంగా ఉన్నాయో లేదో అన్న భయం కూడా విద్యార్థులను వెంటాడుతోంది.

అధికారులు దృష్టిసారిస్తారా.?

పరీక్ష ఫలితాల వెల్లడిలో జాప్యానికి గల కారణాలను అధికారులు వెల్లడించడం లేదు. లక్షల్లో పేపర్లు మూల్యాంకనం చేయాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు ఈ ప్రక్రియను ప్రారంభించినా రెండు, మూడు నెలలు పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ విషయమై వైస్‌ చాన్సలర్‌, ఇతర అధికారులకు శనివారం వినతిపత్రం సమర్పించేందుకు విద్యార్థి సంఘాలకు చెందిన ప్రతినిధులు సిద్ధమవుతున్నారు.

Updated Date - Jul 19 , 2025 | 12:37 AM