ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సరస్వతి పుష్కరాల ప్రత్యేక బస్సు ప్రారంభం

ABN, Publish Date - May 23 , 2025 | 12:28 AM

తెలంగాణలోని కాళేశ్వరం సరస్వతి పుష్కరాల ప్రత్యేక బస్సును ఆర్టీసీ విశాఖ రీజనల్‌ మేనేజర్‌ బి.అప్పలనాయుడు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ద్వారకా బస్‌స్టేషన్‌ కారిడార్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విశాఖ నుంచి కాళేశ్వరం పుష్కరాలకు రాకపోకలు సాగించే భక్తుల కోసం అవసరమైనన్ని ప్రత్యేక బస్సులను నడిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

పుష్కరాల ప్రత్యేక బస్సును ప్రారంభించిన ఆర్‌ ఎం అప్పలనాయుడు

ద్వారకాబస్‌స్టేషన్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని కాళేశ్వరం సరస్వతి పుష్కరాల ప్రత్యేక బస్సును ఆర్టీసీ విశాఖ రీజనల్‌ మేనేజర్‌ బి.అప్పలనాయుడు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ద్వారకా బస్‌స్టేషన్‌ కారిడార్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విశాఖ నుంచి కాళేశ్వరం పుష్కరాలకు రాకపోకలు సాగించే భక్తుల కోసం అవసరమైనన్ని ప్రత్యేక బస్సులను నడిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇంద్ర, ఆలా్ట్ర డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ వంటి సర్వీసులను సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో సరస్వతి పుష్కరాలకు వెళ్లేవారి కోసం బస్సులను సిద్ధం చేశామన్నారు. ఆన్‌లైన్‌లో గానీ ఆథరైజ్డ్‌ ఏజెన్సీల నుంచి కానీ టికెట్లు రిజర్వ్‌ చేసుకునే అవకాశం ఉందని ఆర్‌ఎం పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ జి.సత్యనారాయణ, విశాఖ డిపో మేనేజర్‌ గంగాధర్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ రామకృష్ణ, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉజ్వల, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2025 | 12:28 AM