ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇసుక, గ్రావెల్‌ దందాను 48 గంటల్లో ఆపాల్సిందే

ABN, Publish Date - May 28 , 2025 | 12:25 AM

మండలంలో ఇసుక, గ్రావెల్‌ దందాలను 48 గంటల్లోగా ఆపియించాలని, లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గం ఇన్‌చార్జి పీవీఎస్‌ఎన్‌ రాజు హెచ్చరించారు. మంగళవారం ఆయనతోపాటు పార్టీ నాయకలు ఇక్కడ రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్‌ అంబటి రామారావుతో సమావేశమయ్యారు.

తహసీల్దార్‌ రామారావుతో మాట్లాడుతున్న జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జి పీవీఎస్‌ఎన్‌ రాజు, నాయకులు

లేకుంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతాం

తహసీల్దారుకు జనసేన పార్టీ ‘చోడవరం’ ఇన్‌చార్జి పీవీఎస్‌ఎన్‌ రాజు అల్టిమేటం

చోడవరం, మే 27(ఆంధ్రజ్యోతి): మండలంలో ఇసుక, గ్రావెల్‌ దందాలను 48 గంటల్లోగా ఆపియించాలని, లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గం ఇన్‌చార్జి పీవీఎస్‌ఎన్‌ రాజు హెచ్చరించారు. మంగళవారం ఆయనతోపాటు పార్టీ నాయకలు ఇక్కడ రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్‌ అంబటి రామారావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో సాగుతున్న ఇసుక, గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై ఫొటోలు, వీడియోలను ఆయనకు అందించారు. అడ్డగోలుగా మైనింగ్‌ జరుగుతుంటే రెవెన్యూ సిబ్బంది స్పందించకపోవడం, తహసీల్దారు హోదాలో మీరు ఎటువంటి కట్టడి చర్యలు చేపట్టకపోవడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇసుక, గ్రావెల్‌ అక్రమ తవ్వకాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులతో కమిటీ వేయాలని ఆయన సూచించారు. అనంతరం కార్యాలయం నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. రెవెన్యూ అధికారుల అండతోనే ఇసుక, గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. శారదా నదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరుపుతుంటే జలవనరుల శాఖ అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు. విశాఖ, అనకాపల్లి ప్రాంతాలకు చెందిన వ్యక్తులు రాజకీయ అండదండలతో చోడవరం ప్రాంతంలో సహజ వనరులను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. మండలంలో ఇసుక, గ్రావెల్‌ దోపిడీ నిరోధానికి పంచాయతీల వారీగా సమన్వయ కమిటీలు వేయాలని, మండలస్థాయిలో టాస్క్‌ఫోర్సు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. జనసేన నాయకులు అల్లం రామప్పారావు, గూనూరు మూలినాయుడు, నరవ సరోజని, కర్రి రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 28 , 2025 | 12:25 AM