ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తల్లికి వందనం!

ABN, Publish Date - Jun 13 , 2025 | 01:11 AM

రాష్ట్ర ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌లో భాగంగా ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లి వందనం’ పథకం కింద జిల్లాలో అర్హుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి విడుదల చేసింది. రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు, ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న 1,56,182 మంది విద్యార్థులు అర్హులుగా ప్రకటించింది.

పాడేరు మండలం లగిశపల్లి సచివాలయంలో విద్యార్థి బయోమెట్రిక్‌ నమోదు

జిల్లాలో 1,56,182 మంది అర్హులు

94,781 మంది తల్లులు

రెండు నుంచి పదో తరగతి వరకు, ఇంటర్‌ రెండో ఏడాదికి జాబితా విడుదల

ఒకటి, రెండు రోజుల్లో తల్లుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ

ఒకటో తరగతి, ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాల తరువాత దరఖాస్తుల స్వీకరణ

అనంతరం అర్హుల జాబితా ప్రకటన

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌లో భాగంగా ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లి వందనం’ పథకం కింద జిల్లాలో అర్హుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి విడుదల చేసింది. రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు, ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న 1,56,182 మంది విద్యార్థులు అర్హులుగా ప్రకటించింది. ఒకటో తరగతి, ఇంటర్‌ ఫస్టియర్‌లో ప్రవేశాలు పూర్తయిన తరువాత వీరిలో అర్హులకు కూడా ఈ పథకం అమలవుతుంది. ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో సుమారు లక్ష మందికిపైగా పాఠశాలల విద్యార్థులు వుండగా, మిగిలిన వారు కళాశాలల విద్యార్థులు. కుటుంబంలో ఎంత మంది విద్యార్థులు వుంటే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకారం 1,56,182 మంది విద్యార్థులకు సంబంధించి 94,781 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు ఒకటి, రెండు రోజుల్లో డబ్బులు జమ కానున్నాయి. గతం వైసీపీ ప్రభుత్వం కుటుంబంలో ఒక్క విద్యార్థికి మాత్రమే అమ్మఒడి పథకం పేరుతో రూ.15 వేలు (పాఠశాలల్లో పారిశుధ్యం పేరుతో ఇందులో రూ.2 వేలు కోత విధించింది) మాత్రమే ఇచ్చింది.

‘తల్లికి వందనం’ పథకానికి అర్హతలివే..

విద్యార్థి కుటుంబ వార్షిక దాయం గ్రామాల్లో రూ.1.2 లక్షలు, పట్టణాల్లో అయితే రూ.1.44 లక్షల లోపు వుండాలి.

కుటుంబానికి విధిగా బియ్యం కార్డు ఉండాలి.

వ్యసాయ భూమి 10 ఎకరాలకు మించకూడదు.

బియ్యం కార్డులో పేర్లు వున్న వారి పేరిట నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు.

విద్యార్థి హాజరు గత విద్యా సంవత్సరంలో 75 శాతానికి తగ్గకూడదు.

కుటుంబ విద్యుత్‌ వాడకం నెలకు 300 యూనిట్లు దాటకూడదు.

Updated Date - Jun 13 , 2025 | 01:11 AM