ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఏజెన్సీకి ఆర్టీసీ నైట్‌హాల్ట్‌ సర్వీసులు నిలుపుదల

ABN, Publish Date - May 24 , 2025 | 01:08 AM

ఛత్తీస్‌గఢ్‌లో వరుసగా జరుగుతున్న ఎదురుకాల్పుల నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గురువారం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలకు రాత్రి హాల్ట్‌ బస్సు సర్వీసులను ఆపేశారు.

నర్సీపట్నం ఆర్టీసీ బస్టేషన్‌

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు

నర్సీపట్నం, మే 23(ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‌లో వరుసగా జరుగుతున్న ఎదురుకాల్పుల నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గురువారం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలకు రాత్రి హాల్ట్‌ బస్సు సర్వీసులను ఆపేశారు. రెండు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, అగ్రనేతల్లో ఒకరైన నంబాల కేశవరావుతో సహా 26 మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన తరువాత ఏవోబీలో మావోయిస్టులు లేదా వారి సానుభూతిపరులు ప్రతీకారదాడులకు దిగి, ఆర్టీసీ బస్సులకు నష్టం కలిగించే చర్యలకు పాల్పడే అవకాశం వుందని అధికారులు భావించారు. దీంతో ముందస్తు జాగత్త చర్యగా నర్సీపట్నం డిపో నుంచి సాయంత్రం ఐదు గంటల తరువాత ఏజెన్సీకి నడిచే బస్సుల సర్వీసులను ఆపేశారు. కృష్ణాదేవిపేట, కొయ్యూరు, రేవళ్లు, చింతపల్లి, సీలేరు, జీకేవీధి, భద్రాచలం, నాతవరం మండలం తాండవ, సరుగుడు తదితర ప్రాంతాలకు నడిచే 21 బస్సు సర్వీసులను రద్దు చేశారు. ఏజెన్సీకి నైట్‌హాల్ట్‌ బస్సును పూర్తిగా ఆపేశారు. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి వుంటుందని అధికారులు అంటున్నారు.

Updated Date - May 24 , 2025 | 01:08 AM