ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సంపద కేంద్రాలకు పునరుజ్జీవం

ABN, Publish Date - Jul 07 , 2025 | 11:30 PM

గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా గత వైసీపీ ప్రభుత్వ పాలనలో నిర్వీర్యమైన సంపద సృష్టి కేంద్రాలను మళ్లీ గాడిలో పెట్టాలని నిర్ణయించింది. జిల్లాలో వృథాగా ఉన్న అన్ని సంపద సృష్టి కేంద్రాలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది.

అచ్యుతాపురంలోని వైఎస్సార్‌ నగర్‌లో నిర్మిస్తున్న సంపద కేంద్రం

520 కేంద్రాలను వినియోగంలోకి తేవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం

గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన వాటికి మోక్షం

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా గత వైసీపీ ప్రభుత్వ పాలనలో నిర్వీర్యమైన సంపద సృష్టి కేంద్రాలను మళ్లీ గాడిలో పెట్టాలని నిర్ణయించింది. జిల్లాలో వృథాగా ఉన్న అన్ని సంపద సృష్టి కేంద్రాలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. 2014-19 మధ్య కాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల పేరుతో వర్మీ కంపోస్టు యూనిట్లను రూ.లక్షలు వ్యయం చేసి నిర్మించింది. అయితే గత వైసీపీ ప్రభుత్వం వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీంతో ఇవి వృథాగా పడి ఉన్నాయి. కాగా కూటమి ప్రభుత్వం జిల్లాలో వృథాగా ఉన్న 450 కేంద్రాలు, అప్పట్లో అరకొర నిర్మాణాలతో నిలిచిపోయిన 70కి పైగా కేంద్రాలను వినియోగంలోకి తేవాలని నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాలో పలు మండలాల్లో పాత కేంద్రాలకు మరమ్మతు పనులు చేపడుతుండగా, 22 కొత్త కేంద్రాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రతి మంగళ, బుధ, గురువారాల్లో మండల అభివృద్ధి అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది చెత్త సంపద సృష్టి కేంద్రాలను సందర్శించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

త్వరలో వినియోగంలోకి సంపద కేంద్రాలు

జిల్లాలో చెత్త నుంచి సంపద కేంద్రాలను వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని చెత్త నుంచి సంపద కేంద్రాల జిల్లా సమన్వయకర్త నాగలక్ష్మి తెలిపారు. వృథాగా ఉన్న కేంద్రాలకు మరమ్మలు చేపట్టడం, లేని చోట కొత్తవి నిర్మించడం వంటి పనులు గ్రామ పంచాయతీలు చేస్తున్నాయన్నారు.

Updated Date - Jul 07 , 2025 | 11:30 PM