వర్షంతో ఉపశమనం
ABN, Publish Date - Jul 20 , 2025 | 01:04 AM
జిల్లాలో పలు మండలాల్లో వర్షం కురిసింది. అనకాపల్లి పట్టణంలో శనివారం మధ్యాహ్నం వర్షం పడింది. ఉదయం నుంచి ఎండ కాయగా, మఽధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై వర్షం కురిసింది. దీంతో రహదారులు తడిసి ముద్దయ్యాయి. పలు పల్లపు ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే వర్షానికి వాతావరణం చల్లబడడంతో జనం ఉపశమనం పొందారు.
- ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ
- ఆ తరువాత భారీ వర్షం
- ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఊరట
అనకాపల్లి టౌన్, జూలై 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు మండలాల్లో వర్షం కురిసింది. అనకాపల్లి పట్టణంలో శనివారం మధ్యాహ్నం వర్షం పడింది. ఉదయం నుంచి ఎండ కాయగా, మఽధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై వర్షం కురిసింది. దీంతో రహదారులు తడిసి ముద్దయ్యాయి. పలు పల్లపు ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే వర్షానికి వాతావరణం చల్లబడడంతో జనం ఉపశమనం పొందారు.
ఎలమంచిలిలో...
ఎలమంచిలి: మండలంలో శనివారం వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోతతో జనం అల్లాడిపోగా, మధ్యాహ్నం కురిసిన వర్షానికి ఊరట చెందారు. ఈ వర్షం వ్యవసాయ పనులకు కొంత ఉపయోగపడుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
పాయకరావుపేటలో..
పాయకరావుపేట: గత కొద్ది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో ఎండాకాలాన్ని తలపించిన పాయకరావుపేటలో శనివారం సాయంత్రం భారీ వర్షం పడింది. ఉదయం నుంచి భానుడు ప్రతాపం చూపగా, సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా వాతావరణంలో మార్పువచ్చి భారీ వర్షం పడింది. అర్ధగంటపాటు పడిన వర్షానికి పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయంకాగా, మెయిన్‌రోడ్డులోని పల్లపు ప్రాంతాలు చెరువులను తలపించాయి. దీంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. కాగా ఉదయం నుంచి అధిక ఉష్ణోగ్రత వలన ఉక్కపోతకు గురైన ప్రజలు సాయంత్రం పడిన వర్షానికి వాతావరణం చల్లబడి ఉపశమనం పొందారు.
గొలుగొండ మండలంలో..
కృష్ణాదేవిపేట: గొలుగొండ మండలం ఏఎల్‌పురం, చోద్యం, నాగాపురం, లింగంపేట, పాతకృష్ణాదేవిపేట, కొంగసింగి తదితర గ్రామాల్లో శనివారం చిరు జల్లులు కురిశాయి. గత వారం రోజులుగా ఎండతో అల్లాడుతున్న ప్రజలు వాతావరణం ఒక్కసారిగా చల్లబడి పలుమార్లు చిరుజల్లులు పడడంతో ఆనందం వ్యక్తం చేశారు.
Updated Date - Jul 20 , 2025 | 01:04 AM