ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

లక్ష్యం దాటిన రిజిస్ట్రేషన్లు

ABN, Publish Date - Jun 07 , 2025 | 01:14 AM

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కొత్త ఉత్సాహంతో పనిచేస్తోంది. పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వ విధానం ఏమిటో చాలా స్పష్టంగా అర్థం కావడంతో ఎవరికి ఎక్కడ ఆసక్తి ఉంటే అక్కడ స్థిరాస్తులు కొనుగోలు చేస్తున్నారు.

  • ఆశాజనకంగా లావాదేవీలు

  • మే నెలలో రూ.205.09 కోట్ల ఆదాయం

  • స్లాట్‌ విధానంపై కక్షిదారుల సంతృప్తి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కొత్త ఉత్సాహంతో పనిచేస్తోంది. పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వ విధానం ఏమిటో చాలా స్పష్టంగా అర్థం కావడంతో ఎవరికి ఎక్కడ ఆసక్తి ఉంటే అక్కడ స్థిరాస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం అటు అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తూ, ఇటు విశాఖపట్నాన్ని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కేంద్రంగా ఉన్నత స్థానంలో నిలపడానికి కృషిచేస్తున్న విషయాన్ని అంతా గమనిస్తున్నారు. టీసీఎస్‌, గూగుల్‌ వంటి సంస్థలు ఇక్కడ కార్యాలయాల ప్రారంభానికి ముందుకు రావడంతో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో సొంత ఇల్లు సమకూర్చుకోవాలనే కోరిక ఉన్న వారి శక్తి మేరకు ఫ్లాట్లు కొనడానికి ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మే నెలలో రిజిస్ట్రేషన్ల శాఖ లక్ష్యాన్ని దాటి మరీ ఆదాయాన్ని నమోదు చేసింది. ప్రభుత్వం విశాఖ జిల్లాలో తొమ్మిది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు కలిపి రూ.203.68 కోట్ల ఆదాయం సాధించాలని లక్ష్యం ఇవ్వగా వారు 101 శాతంతో 205.09 కోట్లు సాధించారు.

స్లాట్‌ విధానంతో మేలు

జి.బాలకృష్ణ, డీఐజీ

ప్రభుత్వం రిజిస్ట్రేషన్లకు స్లాట్‌ విధానం అమలు చేయడం వల్ల కక్షిదారులు వారికి నచ్చిన సమయంలో వచ్చి వారి రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకొని వెళుతున్నారు. ఉదయాన్నే వచ్చి సాయంత్రం వరకూ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది. అనుకోకుండా ఏదైనా సాంకేతిక సమస్య ఉత్పన్నమైతే అందరినీ పంపించేసి, సాయంత్రం ఐదు గంటల తరువాత రమ్మని చెప్పి, అప్పుడు వ్యహారాలు పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని కార్యాలయాల్లోను స్లాట్‌ విధానంలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. దీనిపై అంతా సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.

కార్యాలయాల వారీగా ఆదాయం...

------------------------------------------------------------------------------------------------

కార్యాలయం లక్ష్యం సాధించినది డాక్యుమెంట్లు

------------------------------------------------------------------------------------------------

భీమునిపట్నం రూ.12.03 కోట్లు రూ.10.86 కోట్లు 627

సూపర్‌బజార్‌ ఆఫీసు రూ.49.71 కోట్లు రూ.38.09 కోట్లు 1,216

గాజువాక రూ.19.17 కోట్లు రూ.42.25 కోట్లు 756

గోపాలపట్నం రూ.10.44 కోట్లు రూ.8.84 కోట్లు 579

ద్వారకానగర్‌ రూ.21.35 కోట్లు రూ.17.11 కోట్లు 701

మధురవాడ రూ.47.13 కోట్లు రూ.52.09 కోట్లు 903

ఆనందపురం రూ.11.74 కోట్లు రూ.10.45 కోట్లు 609

పెదగంట్యాడ రూ.17.14 కోట్లు రూ.13.16 కోట్లు 949

పెందుర్తి రూ.14.46 కోట్లు రూ.12.23 కోట్లు 620

-------------------------------------------------------------------------------------------

Updated Date - Jun 07 , 2025 | 01:14 AM