ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గుజ్జెలిలో ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా

ABN, Publish Date - Jul 09 , 2025 | 11:54 PM

మండలంలోని గుమ్మకోట పంచాయతీ గుజ్జెలి గ్రామం సమీపంలో హైడ్రో పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటుపై బుధవారం నిర్వహించాల్సిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం వాయిదా పడింది.

గుజ్జెలి వద్ద ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం వాయిదా పడడంతో ఖాళీగా ఉన్న కుర్చీలు

హైడ్రో పవర్‌ ప్రాజెక్టు వద్దంటూ వైసీపీ నాయకుల ఆందోళన

అనంతగిరి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గుమ్మకోట పంచాయతీ గుజ్జెలి గ్రామం సమీపంలో హైడ్రో పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటుపై బుధవారం నిర్వహించాల్సిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం వాయిదా పడింది. ఈ కార్యక్రమానికి సబ్‌కలెక్టర్‌ శౌర్యమన్‌ పటేల్‌ మధ్యాహ్నం వరకు హాజరుకాకపోవడంతో అధికారులు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. అయితే ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు, సర్పంచ్‌ అప్పారావు, ఎంపీటీసీ తౌటినాయుడు, ఎంపీపీ శెట్టి నీలవేణి, కో-ఆప్షన్‌ సభ్యుడు మదీనా, తదితరులు హాజరయ్యారు. కొంతసేపు గిరిజనులతో చర్చించారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్టు మాకొద్దు అంటూ ఎంపీపీ శెట్టి నీలవేణితో పాటు సర్పంచ్‌ అప్పారావు, వైసీపీ మండల అఽధ్యక్షుడు సూర్యనారాయణ, తదితర వైసీపీ నాయకులు నినాదాలు చేశారు. గుజ్జెలి వద్ద ఎటువంటి గొడవలు, అల్లర్లు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఎస్‌ఐ డి.శ్రీనివాసరావు గట్టి పోలీసుబందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - Jul 09 , 2025 | 11:54 PM