ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం

ABN, Publish Date - Apr 22 , 2025 | 01:27 AM

విశాఖపట్నంలో రియల్‌ ఎస్టేట్‌ ‘భూ’మ్‌ తగ్గుముఖం పట్టింది.

  • గత ఏడాది కంటే రూ.13 కోట్లు మైనస్‌

  • ఇప్పుడు అన్ని చోట్ల స్లాట్‌ బుకింగ్‌ ద్వారానే రిజిస్ట్రేషన్లు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నంలో రియల్‌ ఎస్టేట్‌ ‘భూ’మ్‌ తగ్గుముఖం పట్టింది. విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామని గత వైసీపీ ప్రభుత్వం పదేపదే ప్రకటనలు చేయడంతో భూముల ధరలు గణనీయంగా పెరిగిపోయాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ భూములు కొనుగోలు చేయడం వల్ల ధరలు రెట్టింపు అయ్యాయి. రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం ఒక్కసారిగా ఎగబాకింది. అప్పటివరకూ ఏడాదికి రూ.500 కోట్లు ఆదాయం వస్తే గొప్ప అనుకునే విశాఖ జిల్లా రిజిస్ట్రేషన్ల శాఖకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో కరోనా కారణంగా 40 రోజులు కార్యాలయాలు మూసేసినా రూ.595.57 కోట్లు వచ్చింది. ఆ మరుసటి ఏడాది (2020-21)లో రూ.60 కోట్లు పెరిగి రూ.654.24 కోట్లకు చేరింది. 2021-22లో ఏకంగా రూ.200 కోట్లు పెరిగి రూ.859.89 కోట్లు వచ్చింది. ఆ తరువాత 2022-23 ఆర్థిక సంవత్సరంలో కూడా రూ.815.81 కోట్ల ఆదాయం సమకూరింది. 2023-24లో మరో రూ.200 కోట్లు పెరిగి ఏకంగా వేయి కోట్ల మార్కును దాటేసి రూ.1,060.03 కోట్ల రికార్డు స్థాయి ఆదాయం నమోదుచేసింది.

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో మూడు రాజధానులు ఉండవని స్పష్టత వచ్చింది. అయినా ఆదాయంలో పెద్దగా తేడా రాలేదు. వేయి కోట్ల రూపాయల మార్కును కొనసాగిస్తూ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1,047.74 కోట్ల ఆదాయం చూపించారు. గత ఏడాది కంటే కేవలం రూ.13 కోట్లు మాత్రమే రాబడి తగ్గింది. జిల్లాల విభజనలో భాగంగా రెండేళ్ల క్రితం అనకాపల్లి జిల్లాలో ఉన్న పెదగంట్యాడను తీసుకువచ్చి విశాఖ జిల్లాలో కలిపారు. దాంతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల సంఖ్య తొమ్మిది నుంచి పదికి పెరిగింది.

ఇప్పుడు అన్ని కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌

ఈ నెల మొదటి వారంలో రిజిస్ట్రేషన్లకు స్లాట్‌ బుకింగ్‌ విధానం ప్రారంభించారు. జిల్లాకు ఒక కార్యాలయం చొప్పున మొదలుపెట్టగా తొలుత విశాఖలో సూపర్‌ బజారు ప్రాంగణంలోని ఆర్‌ఓలో శ్రీకారం చుట్టడం జరిగింది. కొద్దిగా ఇబ్బందులు ఉన్నా..అప్పుడప్పుడు సర్వర్‌ మొరాయిస్తున్నా ప్రభుత్వం స్లాట్ల ద్వారానే రిజిస్ట్రేషన్లు చేయాలని స్పష్టం చేసింది. దాంతో ఈ నెల 21వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలో స్లాట్ల ద్వారానే రిజిస్ట్రేషన్లు ప్రారంభించినట్టు డీఐజీ బాలకృష్ణ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

కార్యాలయాల వారీగా సాధించిన ఆదాయం

--------------------------------------------------------------------------------------------------------

కార్యాలయం 2021-2022 2022-2023 2023-2024 2024-2025

--------------------------------------------------------------------------------------------------------------------

ఆనందపురం రూ.56.06 కోట్లు రూ.58.67 కోట్లు రూ.58.78 కోట్లు రూ.62.75 కోట్లు

భీమునిపట్నం రూ.66.53 కోట్లు రూ.56.64 కోట్లు రూ.68.38 కోట్లు రూ.56.07 కోట్లు

ద్వారకానగర్‌ రూ.89.31 కోట్లు రూ.94.11 కోట్లు రూ.109.14 కోట్లు రూ.111.8 కోట్లు

గాజువాక రూ.70.6 కోట్లు రూ.73.73 కోట్లు రూ.112.93 కోట్లు రూ.90.61 కోట్లు

గోపాలపట్నం రూ.47.31 కోట్లు రూ.49.22 కోట్లు రూ. 57.16 కోట్లు రూ.50.91 కోట్లు

మధురవాడ రూ.243.06 కోట్లు రూ.218.05 కోట్లు రూ.237.89 కోట్లు రూ.249.87 కోట్లు

పెందుర్తి రూ.83.39 కోట్లు రూ.69.87 కోట్లు రూ. 73.37 కోట్లు రూ.76.3 కోట్లు

విశాఖ ఆర్‌ఓ రూ.203.63 కోట్లు రూ.195.52 కోట్లు రూ.252.31 కోట్లు రూ.262.09 కోట్లు

పెదగంట్యాడ ---- ------- రూ. 90.07 కోట్లు రూ.87.33 కోట్లు

---------------------------------------------------------------------------------------

Updated Date - Apr 22 , 2025 | 01:27 AM