ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పెట్టుగోళ్లపల్లి సర్పంచ్‌ ప్రశాంతికి అరుదైన గౌరవం

ABN, Publish Date - Jul 27 , 2025 | 12:55 AM

మండలంలోని పెట్టుగోళ్లపల్లి గ్రామ సర్పంచ్‌ అల్లు వెంకట ప్రశాంతికి అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానం అందింది. ఈ విషయం శనివారం ఎంపీడీవో సత్యనారాయణ తెలిపారని ఆమె స్థానిక విలేకరులకు వెల్లడించారు.

పెట్టుగోళ్లపల్లి సర్పంచ్‌ అల్లు వెంకట ప్రశాంతి (ఫైల్‌)

- ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొనే అవకాశం

ఎస్‌.రాయవరం, జూలై 26(ఆంధ్రజ్యోతి): మండలంలోని పెట్టుగోళ్లపల్లి గ్రామ సర్పంచ్‌ అల్లు వెంకట ప్రశాంతికి అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానం అందింది. ఈ విషయం శనివారం ఎంపీడీవో సత్యనారాయణ తెలిపారని ఆమె స్థానిక విలేకరులకు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంతో పాటు గ్రామాభివృద్ధికి పాటుపడుతున్నందుకు ఆమెకు ఈ అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ తనకు ఈ ఆహ్వానం అందడం సంతోషంగా ఉందని, ఇది గ్రామస్థుల సహకారం వల్లే సాధ్యమైందని తెలిపారు. ఈ విషయం తెలిసి ఆమెను గ్రామస్థులు అభినందించారు.

Updated Date - Jul 27 , 2025 | 12:55 AM