ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైవాడ నీరు రైతులకే..

ABN, Publish Date - Jul 30 , 2025 | 12:22 AM

వచ్చే ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ నుంచి రైవాడ జలాశయం నీరు మొత్తం ఆయకట్టుకే సరఫరా చేస్తామని, దీంతో ఆయకట్టు స్థిరీకరణతోపాటు ఏటా రెండు పంటలు పండించుకునే అవకాశం లభిస్తుందని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. మంగళవారం మధ్యాహ్నం చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, అధికారులతో కలిసి ఎరకాలమ్మకు పూజలు చేసి హారతి ఇచ్చిన అనంతరం రైవాడ రిజర్వాయర్‌ నుంచి కాలువలకు నీటిని విడుదల చేశారు.

రైవాడ రిజర్వాయర్‌ వద్ద జలహారతి కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, అధికారులు, కూటమి నాయకులు

వచ్చే ఏడాది విశాఖకు పోలవరం నీరు

ఏటా రెండు పంటలతోపాటు ఆయకట్టు స్థిరీకరణ

మాడుగుల ఎమ్మెల్యే బండారు

రైవాడ కాలువలకు నీరు విడుదల

దేవరాపల్లి, జూలై 29 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ నుంచి రైవాడ జలాశయం నీరు మొత్తం ఆయకట్టుకే సరఫరా చేస్తామని, దీంతో ఆయకట్టు స్థిరీకరణతోపాటు ఏటా రెండు పంటలు పండించుకునే అవకాశం లభిస్తుందని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. మంగళవారం మధ్యాహ్నం చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, అధికారులతో కలిసి ఎరకాలమ్మకు పూజలు చేసి హారతి ఇచ్చిన అనంతరం రైవాడ రిజర్వాయర్‌ నుంచి కాలువలకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పోలవరం ఎడమ కాలువ ద్వారా విశాఖకు నీరు సరఫరా అవుతుందని, దీంతో రైవాడ నుంచి విశాఖకు నీటిని సరఫరా చేయాల్సిన అవసరం వుండదన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాయగా, ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. రైవాడ జలాశయాన్ని రూ.333 కోట్లతో ఆధునీకరించి అభివృద్ధి చేయనున్నట్టు బండారు చెప్పారు. ఈ ఏడాది ఖరీఫ్‌ పంట కోతలు ప్రారంభం కాగానే కాలువలకు నీటి సరఫరాను నిలుపుదల చేసి,ఆధునికీకరణ పనులు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ పనులు పూర్తయితే ఆయకట్టు విస్తీర్ణం పెరుగుతుందని, ఏటా రెండు పంటలు వేసుకోవచ్చని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ ఈఈ ఎ.త్రినాథం, డీఈఈ సత్యంనాయుడు, ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ పాత్రునాయుడు, టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు వాసురెడ్డి ఏసుదాసు, సీనియర్‌ నాయకులు పైలా ప్రసాదరావు, కిలపర్తి భాస్కరరావు, గూనూరు ముల్లునాయుడు, పెద్దాడ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2025 | 12:22 AM