ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వర్ష బీభత్సం

ABN, Publish Date - Jun 30 , 2025 | 11:44 PM

మన్యంలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. సోమవారం ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. పలు మండలాల్లో భారీ వృక్షాలు రహదారులపై పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ముంచంగిపుట్టు మండలం హంసబంద సమీపంలో రహదారికి అడ్డంగా పడిన భారీ వృక్షం

పలు చోట్ల కూలిన భారీ వృక్షాలు

రాకపోకలకు అంతరాయం

పాడేరు, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): మన్యంలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. సోమవారం ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. పలు మండలాల్లో భారీ వృక్షాలు రహదారులపై పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఖరీఫ్‌ వ్యవసాయ పనులు జరుగుతుండడంతో తాజా వర్షాలు తమకు అనుకూలిస్తాయని రైతులు అంటున్నారు. కాగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు సల్పంగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం కొయ్యూరు మినహా మిగతా మండలాల్లో 30 డిగ్రీలకు మించని గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొయ్యూరులో 30.0 డిగ్రీలు, పాడేరులో 25.4, చింతపల్లిలో 24.9, అరకులోయ, హుకుంపేటలో 24.7, పెదబయలులో 24.6, జీకేవీధిలో 24.5, డుంబ్రిగుడలో 24.1, ముంచంగిపుట్టులో 23.8, అనంతగిరిలో 23.6, జి.మాడుగులలో 22.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

చింతపల్లిలో..

చింతపల్లి: మండలంలో కురుస్తున్న వర్షానికి లంబసింగి- చింతపల్లి జాతీయ రహదారి పెద్దగెడ్డ వద్ద భారీ వృక్షం రోడ్డుపై పడింది. దీంతో గంటపాటు ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు స్థానిక గిరిజనుల సహకారంతో ఓ వైపునున్న కొమ్మలను తొలగించారు. దీంతో యథావిధిగా రాకపోకలు సాగాయి. సాయంత్రానికి జాతీయ రహదారుల అధికారులు వృక్షాన్ని పూర్తిగా తొలగించారు.

ముంచంగిపుట్టులో...

ముంచంగిపుట్టు: మండల పరిధిలో సోమవారం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు మండలంలో గల బరడ పంచాయతీ హంసబంద గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో అటుగా వాహన రాకపోకలు స్తంభించిపోయాయి. స్థానికులు అతికష్టంపై గంటల తరబడి శ్రమించి రహదారికి అడ్డంగా ఉన్న చెట్టును తొలగించారు. అలాగే పలు చోట్ల చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి. గాలులకు విద్యుత్‌ సరఫరాకు తరచూ అంతరాయం ఏర్పడింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల మండల కేంద్రం నుంచి జోలాపుట్టు, పెదబయలు, కుమడ, లక్ష్మీపురం, సంగడ తదితర ప్రాంతాలకు వెళ్లే రహదారులు పలు చోట్ల దెబ్బతిన్నాయి. మట్టి రహదారులు అత్యంత అధ్వానంగా మారడంతో అటుగా రాకపోకలు సాగించడం కష్టమైంది. వాగులు, మత్స్యగెడ్డ పాయలు వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జోలాపుట్టు, డుడుమ జలాశయాల్లో వరదనీరు ఇన్‌ఫ్లో పెరుగుతోంది.

అనంతగిరిలో..

అనంతగిరి: మండల కేంద్రానికి కూతవేటుదూరంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమీపంలోని సోమవారం మధ్యాహ్నం అరకు-విశాఖ ప్రధాన రహదారిపై భారీ మామిడిచెట్టు విరిగిపడింది. దీంతో సుమారు గంటపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎస్‌ఐ డి.శ్రీనివాసరావు, ఏఎస్‌ఐ వెంకటరావు, సిబ్బంది చెట్టు తొలగింపు చర్యలు చేపట్టారు. అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Updated Date - Jun 30 , 2025 | 11:44 PM