ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రైవేటు ఆస్పత్రులకు కళ్లెం

ABN, Publish Date - Jul 23 , 2025 | 01:04 AM

‘‘కడుపునొప్పి వస్తుందని ఆస్పత్రిలో చేరాను. శస్త్ర చికిత్సకు రూ.80 వేలు ఖర్చవుతుందని చెప్పారు.

  • ఏ చికిత్సకు ఎంత వసూలు చేస్తారనే వివరాలు

  • రిసెప్షన్‌ కౌంటర్‌ వద్ద ఏర్పాటుచేయాల్సిందిగా ఆరోగ్య శాఖ ఆదేశాలు

  • ఆ సమాచారం అందుబాటులో ఉంచకపోయినా, అంతకుమించి వసూలు చేసినా చర్యలు

  • రోగుల వద్ద నుంచి ఫిర్యాదులు వస్తే విచారణ

విశాఖపట్నం, జూలై 22 (ఆంధ్రజ్యోతి):

‘‘కడుపునొప్పి వస్తుందని ఆస్పత్రిలో చేరాను. శస్త్ర చికిత్సకు రూ.80 వేలు ఖర్చవుతుందని చెప్పారు. తీరా డిశ్చార్జ్‌ అయ్యే సమయానికి రూ.1.8 లక్షలు బిల్లు చేతిలో పెట్టారు. ముందే ఇంత మొత్తం అవుతుందని చెబితే ఆస్పత్రిలో చేరేవాడిని కాదు’...ఇదీ నగర పరిధిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో కొన్నిరోజుల కిందట శస్త్ర చికిత్స చేయించుకున్న రామారావు ఆవేదన.

నగరంలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగులు ఇదే తరహా ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. ఇందుకు చెక్‌ చెప్పేందుకు ఆరోగ్య శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. ఆస్పత్రుల్లో సేవలకయ్యే ఖర్చుల వివరాలు నోటీస్‌ బోర్డులో ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. ఆస్పత్రులు, ల్యాబ్‌లు, క్లినిక్స్‌లో రిసెప్షన్‌ కౌంటర్‌ వద్ద ఈ ధరల పట్టికను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. ఈ మేరకు ఆస్పత్రులకు సమా చారాన్ని అందించారు. ఆస్పత్రులు, ల్యాబ్‌లలో అయితే శస్త్రచికిత్సలు, వైద్యుల కన్సల్టేషన్‌, పరీ క్షలకు సంబంధించిన ధరల జాబితాను, ల్యాబ్‌ లలో అయితే చేసే పరీక్ష, దాని ధర వంటి వివరాలను ఏర్పాటుచేయాలి. అలా ఏర్పాటు చేయని ఆస్పత్రులపై రోగులు, వారి సహాయ కులు ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేయ వచ్చు. ఆయా ఫిర్యాదులను బట్టి క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ 2002 ప్రకారం చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆస్పత్రులు తీరు మార్చుకోకపోతే అనుమతులు రద్దు చేసేందుకు అవకాశం ఉంది.

ఇదీ లెక్క..

జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులు 254 ఉన్నాయి. క్లినిక్స్‌ 311, ఆల్ర్టా సౌండ్‌ పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌లు 340, ఫిజియో థెరపీ యూనిట్లు 18, క్లినికల్‌ లేబొరేటరీలు 188, డెంటల్‌ ఆస్పత్రులు 40 వరకూ ఉన్నాయి. వీటిలో వైద్య సేవలకు సంబంధించిన ధరల జాబితాను వారం రోజుల్లో ఏర్పాటు చేయాలని, లేకపోతే చర్యలు తప్పవని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు.

పారదర్శక సేవలు అందించే ఉద్దేశంతోనే...

- డాక్టర్‌ పి.జగదీశ్వరరావు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి

ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులు, క్లినిక్స్‌, ల్యాబ్‌లలో పారదర్శకమైన వైద్య సేవలు అందించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రోగికి ముందే తాను పొందాలనుకునే వైద్యసేవ ధర తెలిస్తే నచ్చితే చేయించుకుంటాడు, లేదంటే మరోచోటకు వెళతాడు. ధరల పట్టిక ఏర్పాటు చేయకపోయినా, అందులో పేర్కొన్న దానికి అదనంగా వసూలు చేసినా చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రులు, క్లినిక్స్‌, ల్యాబ్‌ల నిర్వాహకులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. అమలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు.

Updated Date - Jul 23 , 2025 | 01:04 AM