ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధం

ABN, Publish Date - Jun 25 , 2025 | 12:28 AM

మన్యంలో ప్రస్తుతం ఖరీఫ్‌ వ్యవసాయ పనుల్లో గిరిజన రైతులు నిమగ్నమయ్యారు. దీంతో ఏజెన్సీలో ఎటు చూసినా నీటితో నిండిన పంట పొలాలు, తమ భూములను దున్నుతున్న రైతులే కనిపిస్తున్నారు. ఏప్రిల్‌, మే నెలల్లోనే సమృద్ధిగా వర్షాలు కురవడంతో వేసవి దుక్కి పనులను ఇప్పటికే పూర్తి చేశారు. ఈ నెలాఖరుకు మొత్తం దుక్కి పనులను పూర్తి చేసి, జూలై రెండో వారం లేదా ఆగస్టు నెల ముగిసే నాటికి వరి నాట్లు పూర్తి చేసేలా వ్యవసాయ పనులు ముమ్మరం చేస్తున్నారు.

జి.మాడుగుల మండల వి.కోడాపల్లిలో దుక్కి పనులు చేపడుతున్న గిరి రైతు

- రైతులకు 90 శాతం రాయితీపై విత్తనాల పంపిణీ

- ఇప్పటికే వేసవి దుక్కి పనులు పూర్తి

- జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో 61,188 హెక్టార్లలో వరి సాగు

- జూలై మొదటి వారంలో నాట్లుకు సిద్ధమవుతున్న రైతులు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

మన్యంలో ప్రస్తుతం ఖరీఫ్‌ వ్యవసాయ పనుల్లో గిరిజన రైతులు నిమగ్నమయ్యారు. దీంతో ఏజెన్సీలో ఎటు చూసినా నీటితో నిండిన పంట పొలాలు, తమ భూములను దున్నుతున్న రైతులే కనిపిస్తున్నారు. ఏప్రిల్‌, మే నెలల్లోనే సమృద్ధిగా వర్షాలు కురవడంతో వేసవి దుక్కి పనులను ఇప్పటికే పూర్తి చేశారు. ఈ నెలాఖరుకు మొత్తం దుక్కి పనులను పూర్తి చేసి, జూలై రెండో వారం లేదా ఆగస్టు నెల ముగిసే నాటికి వరి నాట్లు పూర్తి చేసేలా వ్యవసాయ పనులు ముమ్మరం చేస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌ సీజన్‌లో లక్షా 23 వేల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతుండగా, దానిలో వరి 61,188 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. అధిక విస్తీర్ణంలో వరి సాగవుతున్నప్పటికీ ఏజెన్సీలోని గిరిజన రైతులు తమ ఆహార అవసరాలకు మాత్రమే వాటిని వినియోగిస్తారు. దీంతో ఏజెన్సీలో వరి ఆహార పంటగా మాత్రమే సాగవుతున్నది.

90 శాతం రాయితీపై విత్తనాల పంపిణీ

2025 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి గిరిజన రైతులకు 90 శాతం రాయితీపై పలు విత్తనాలను పంపిణీ చేసే ప్రక్రియకు వ్యవసాయాధికారులు ఇప్పటికే శ్రీకారం చుట్టారు. 23,840 క్వింటాళ్లు వరి, 141 క్వింటాళ్లు రాగులు, 364 క్వింటాళ్ల అపరాలు, 4,500 క్వింటాళ్లు రాజ్‌మా, 648 క్వింటాళ్లు వేరుశగన విత్తనాలను 90 శాతం రాయితీపై పంపిణీ చేసే ప్రక్రియ జరుగుతున్నది. అలాగే పచ్చిరొట్ట ఎరువులైన జనుము 747 క్వింటాళ్లు, పిల్లిపెసర 401 క్వింటాళ్లు పంపిణీ చేస్తున్నారు. అయితే ఏజెన్సీలో అధిక సంఖ్యలో రైతులుండగా అరకొరగానే అధికారులు విత్తనాలు పంపిణీ చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో ఖరీఫ్‌లో సాగయ్యే పంటల వివరాలు

- వరి 61,188 హెక్టార్లు

- అపరాలు 2,820 హెక్టార్లు

- నూనె గింజలు 1,405 హెక్టార్లు

- ఇతర పంటలు 38,695 హెక్టార్లు

Updated Date - Jun 25 , 2025 | 12:28 AM