ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కూటమి పాలనపై సానుకూలత

ABN, Publish Date - Jun 12 , 2025 | 01:14 AM

కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజల్లో సానుకూలత కనిపిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాలపై మెజారిటీ ప్రజలు సంతృప్తితో, ఉన్నారు. కొందరు మాత్రం పథకాలు సరిగా అమలు చేయడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. గత ప్రభుత్వంలో కొన్ని రకాల భయాలు, ఆందోళనలు ఉండేవని, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదని మరికొంతమంది అన్నారు. ఇప్పటికే కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేశారని, మరికొన్నింటిని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందని, అందుకు మరింత సమయం ఇవ్వాలని ఇంకొందరు పేర్కొంటున్నారు. మొత్తంగా చూస్తే అత్యధికులు సంతృప్తిని, కొందరు అసంతృప్తిని వ్యక్తంచేయగా, ఇంకొందరు పర్వాలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై గురువారం నాటికి ఏడాది అవుతోంది. ఏడాది పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. వివిధ వర్గాలకు చెందిన వారి అభిప్రాయాలను సేకరించారు.

మెజారిటీ ప్రజల్లో సంతృప్తి

పెన్షన్‌ పెంపు, ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ల పంపిణీ,

ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ, మద్యం, ఇసుక విధానాలపై హర్షం

గత ప్రభుత్వంలో భయంతో బతకాల్సి వచ్చేదని,

ఈ ప్రభుత్వంలో ఆ అవసరం లేదన్న మెకానిక్‌

ప్రస్తుతం చేతినిండా పని దొరుకుతోందన్న తాపీమేస్ర్తి

మిశ్రమ స్పందన వెలిబుచ్చిన మరికొందరు

సంక్షేమ పథకాలన్నీ అమలు చేయకపోయినా,

ప్రభుత్వ నిర్ణయాలు బాగున్నాయని కితాబు

హామీలన్నీ ఇంకా పూర్తిగా నెరవేర్చలేదని ఇంకొందరి అసంతృప్తి

నిరుద్యోగ భృతి గురించి ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించిన యువకుడు

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై నేటికి ఏడాది

విశాఖపట్నం, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి):

కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజల్లో సానుకూలత కనిపిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాలపై మెజారిటీ ప్రజలు సంతృప్తితో, ఉన్నారు. కొందరు మాత్రం పథకాలు సరిగా అమలు చేయడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. గత ప్రభుత్వంలో కొన్ని రకాల భయాలు, ఆందోళనలు ఉండేవని, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదని మరికొంతమంది అన్నారు. ఇప్పటికే కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేశారని, మరికొన్నింటిని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందని, అందుకు మరింత సమయం ఇవ్వాలని ఇంకొందరు పేర్కొంటున్నారు. మొత్తంగా చూస్తే అత్యధికులు సంతృప్తిని, కొందరు అసంతృప్తిని వ్యక్తంచేయగా, ఇంకొందరు పర్వాలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై గురువారం నాటికి ఏడాది అవుతోంది. ఏడాది పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. వివిధ వర్గాలకు చెందిన వారి అభిప్రాయాలను సేకరించారు.

ఈ అంశాలపై సంతృప్తి..

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్‌ పెంపు, ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ల పంపిణీ, ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ, మద్యం, ఇసుక వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలు సమర్థిస్తున్నారు. వీటితోపాటు రాష్ట్రాన్ని చంద్రబాబునాయుడు అభివృద్ధి బాటలో నడిపేందుకు శ్రమిస్తున్న తీరు పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో భయంతో బతకాల్సి వచ్చేదని, ఈ ప్రభుత్వంలో ఆ అవసరం లేదని ఎంవీపీ కాలనీకి చెందిన మెకానిక్‌ గురునాయుడు పేర్కొన్నారు. గతంలో భూ ఆక్రమణలు గురించి పెద్దఎత్తున చర్చ జరిగేదని, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదన్నారు. నాడు భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు పని దొరకని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు పని దొరుకుతోందని ఇసుకతోటకు చెందిన తాపీమేస్ర్తి వై.అప్పలస్వామి పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక కృత్రిమ కొరత సృష్టించి పనుల్లేకుండా చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం చేసేందుకు పని దొరుకుతోందని, మద్యం ధర తగ్గించడంతోపాటు మంచిది విక్రయిస్తున్నారంటూ ఆనందాన్ని వ్యక్తంచేశాడు. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నారని, ఇప్పటికే గ్రూప్‌-2, కానిస్టేబుల్‌ పోస్టుల నియామక ప్రక్రియ పూర్తిచేశారని హెచ్‌బీ కాలనీకి చెందిన ఎస్‌.నాగరాజు అనే నిరుద్యోగి పేర్కొన్నాడు. పాలన బాగుందని కితాబిచ్చాడు. ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చారని, అమ్మ ఒడి వేస్తామని ఇప్పటికే ప్రకటించారని, పాలన చాలా బాగుందని కృష్ణా కాలేజీ ప్రాంతానికి చెందిన ఎస్‌.దాక్షాయణి అనే గృహిణి పేర్కొన్నారు.

మిశ్రమ స్పందన అందుకే..

కొన్ని సంక్షేమ పథకాలను ఇంకా అమలు చేయకపోవడంపై అసంతృప్తి ఉ న్నా, కొన్ని నిర్ణయాలను మాత్రం కొన్నివర్గాలు సమర్థిస్తున్నాయి. సంక్షేమ పథకాలన్నీ అమలు చేయకపోయినా, ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చారని జగదాంబ సెంటర్‌ ప్రాంతానికి చెందిన ఎం.లక్ష్మి అభిప్రాయపడ్డారు. అమ్మ ఒడి, ఇతర పథకాలు కూడా అమలు చేస్తే బాగుంటుందని, ఏడాది పాలన పర్వాలేదన్నారు. కోట్లాది రూపాయలు అప్పులు చేసి రాజధానికే పెడుతున్నారని, మిగిలిన ప్రాంతాలపై దృష్టిసారించాలని ప్రైవేటు ఉద్యోగి తాలాడ శివకృష్ణ పేర్కొన్నారు. అయితే పాలనలో మాత్రం పారదర్శకత పెరిగిందన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం కూడా అప్పులు చేస్తోందని, అయితే అభివృద్ధిని మాత్రం పరుగులు పెట్టించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని సీతమ్మధారకు చెందిన నరసింహ అన్నారు.

ఈ నిర్ణయాలపై వ్యతిరేకత..

సంక్షేమ పథకాలను ఇంకా పూర్తిగా అమలు చేయకపోవడంపై కొందరు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆటో డ్రైవర్లను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారని, ఫైన్లు వేయడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని ఆటో డ్రైవర్‌ లక్ష్మణరావు పేర్కొన్నాడు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇప్పటివరకూ ఆ దిశగా చర్యలు చేపట్టలేదని రాజేంద్రప్రసాద్‌ వెల్లడించాడు. నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో గుర్తించే ప్రక్రియను కూడా చేపట్టలేదని, మరి నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారని ప్రశ్నించాడు. ప్రజలకు స్కీమ్స్‌ అందిస్తే వ్యాపారాలు జరుగుతాయని, పాలన ఆశించిన స్థాయిలో లేదని కె.రాజు అనే వ్యాపారి అసంతృప్తి వ్యక్తంచేశారు.

Updated Date - Jun 12 , 2025 | 01:14 AM