శరవేగంగా పొల్లూరు రెండో దశ పనులు
ABN, Publish Date - May 23 , 2025 | 11:09 PM
సీలేరు కాంప్లెక్సు పరిధిలోని పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం రెండో దశ పనులు శరవేగంగా సాగుతున్నాయని పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం ప్లాంట్ మేనేజర్ బి. బాలకృష్ణ తెలిపారు.
ఆరో యూనిట్ స్పైరల్ కేసింగ్ హైడ్రోలిక్ టెస్టింగ్ విజయవంతం
డిసెంబరు నాటికి అందుబాటులోకి 5,6 యూనిట్లు
పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం ప్లాంట్ మేనేజర్ బాలకృష్ణ
సీలేరు, మే 23 (ఆంధ్రజ్యోతి): సీలేరు కాంప్లెక్సు పరిధిలోని పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం రెండో దశ పనులు శరవేగంగా సాగుతున్నాయని పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం ప్లాంట్ మేనేజర్ బి. బాలకృష్ణ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. పొల్లూరులో రెండో దశలో 5,6 యూనిట్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ఈ పనులు డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తవుతాయన్నారు. ఆరో యూనిట్‌లో శుక్రవారం నిర్వహించిన స్పైరల్ కేసింగ్ హైడ్రోలిక్ టెస్టింగ్ విజయవంతమైందన్నారు. ఐదు, ఆరు యూనిట్లకు సంబంధించిన స్పైరల్ కేసింగ్ పనులు పూర్తి కావడంతో ఈ రెండు యూపిట్లకు సంబంధించి టర్భైన్ స్టాటర్, జనరేటర్ విభాగాలకు సంబంధించిన పనలను ప్రారంభిస్తారని ప్లాంట్ మేనేజర్ బి. బాలకృష్ణ తెలిపారు. ఇటీవలే జనరేటర్ స్టాటర్ విభాగాలకు సంబంధించిన యంత్రాలు భోపాల్ బీహెచ్‌ఈఎల్ నుంచి పొల్లూరుకు వచ్చాయన్నారు. మరికొంత సామగ్రి రావలసి ఉందన్నారు. పొల్లూరులో ఈ రెండు యూనిట్లు అందుబాటులోకి వస్తే మరో 230 మెగావాట్ల విద్యుత్ సరఫరా అవుతుందని ప్లాంట్ మేనేజర్ బి.బాలకృష్ణ తెలిపారు.
Updated Date - May 23 , 2025 | 11:09 PM