ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

దంపతుల హత్య కేసులో పోలీసులకు క్లూ?

ABN, Publish Date - Apr 30 , 2025 | 12:59 AM

దువ్వాడ సమీపాన రాజీవ్‌నగర్‌లో ఐదు రోజుల క్రితం జరిగిన వృద్ధ దంపతుల హత్యకు సంబంధించి పోలీసులకు కొన్ని ఆధారాలు లభించినట్టు సమాచారం. వాటి ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.

  • గోడలపై గ్రీజు మరకలు గుర్తింపు

  • తెలిసినవారే చేశారని పిల్లల అనుమానం

విశాఖపట్నం/కూర్మన్నపాలెం, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజోతి):

దువ్వాడ సమీపాన రాజీవ్‌నగర్‌లో ఐదు రోజుల క్రితం జరిగిన వృద్ధ దంపతుల హత్యకు సంబంధించి పోలీసులకు కొన్ని ఆధారాలు లభించినట్టు సమాచారం. వాటి ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. రిటైర్డ్‌ నేవల్‌ డాక్‌యార్డు ఉద్యోగి గంపల యోగీంద్రబాబు (66), ఆయన భార్య లక్ష్మి (52)ని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఒకరోజు తరువాత హత్యోదంతం బయటపడింది. వారి పిల్లలు శిల్ప, సుజిత్‌ ఇద్దరూ అమెరికాలో ఉంటున్నారు. తల్లిదండ్రుల మరణవార్త విని శనివారం ఇక్కడకు చేరుకున్నారు. మృతదేహాలను చూసి తీవ్ర ఆవేదన చెందారు. అత్యంత కిరాతకంగా చంపారని, ఎంతో కక్ష ఉంటే తప్ప అలా చేయరని వ్యాఖ్యానించారు. మరోవైపు ఇది బంగారు నగలు, డబ్బు కోసం చేసిన హత్య కాదని పోలీసులు తేల్చారు. కనిపించకుండా పోయిన లక్ష్మి బంగారు గాజులు కూడా లభించాయని పోలీస్‌ ఉన్నతాధికారి తెలిపారు. ఇంట్లో గోడలపై గ్రీజు మరకలను గుర్తించారు. మెకానిక్‌లు కొందరు ఆ ఇంటికి వచ్చి వెళ్లేవారని తెలిసి ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో రెండు పడక గదులు ఉండగా, వాటికి అనుబంధంగా ఉన్న వాష్‌రూమ్‌కు రెండు వైపులా తలుపులు ఉన్నాయి. వాటి ద్వారా ఒక పడక గది నుంచి మరో పడక గదిలోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ విషయాన్ని యోగేంద్రబాబు కుమార్తె శిల్ప పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. నిందితులు ముందు తండ్రిపై దాడి చేసి ఉంటారని, ఆయన తల్లిని హెచ్చరించి మరో పడక గదిలోకి పంపించేసి ఉంటారని, తండ్రిని చంపిన తరువాత వారు వాష్‌రూమ్‌ ద్వారా తల్లి ఉన్న పడక గదిలోకి వెళ్లి ఆమెపై దాడి చేసి ఉంటారని అనుమానం వ్యక్తంచేశారు. అంటే...ఇంట్లో వాష్‌రూమ్‌కు రెండు తలుపులు ఉన్నాయని తెలిసిన వారే ఈ పని చేశారని ఆమె అభిప్రాయపడ్డారు. పోలీసులు ఈ కోణంలోను దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ఈ కేసులో ఇప్పటివరకూ నాలుగు క్లూలు (ఆధారాలు) లభించాయని, వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారని, త్వరగానే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. ఇటీవల విశాఖపట్నం పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు ఈ కేసు పురోగతి గురించి ఆరా తీయడంతో పోలీసులు వీలైనంత వేగంగా దీనిని ఛేదించాలని ప్రయత్నిస్తున్నారు.

Updated Date - Apr 30 , 2025 | 12:59 AM