ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఖరీఫ్‌ సాగుకు ప్రణాళిక

ABN, Publish Date - May 21 , 2025 | 12:51 AM

జిల్లా వ్యవసాయశాఖ ఖరీఫ్‌ ప్రణాళిక సిద్ధం చేసింది. విత్తనాల నుంచి ఎరువుల వరకు ఎంత మేరకు అవసరమనే దానిపై అధికారులు అంచనాలు వేశారు. గత వైసీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసింది. కేవలం పెట్టుబడి నిధి విడుదల చేసి చేతులు దులుపుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత స్వర్ణాంధ్ర విజన్‌-2047 ప్రణాళికతో ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా 2025-26 సంవత్సరంలో ప్రధాన పంటలైన వరి, అపరాలు, నువ్వుల సాగు విస్తీర్ణం పెంచడమే కాకుండా పంట దిగుబడులు పెంచేందుకు ప్రణాళికతో అడుగులు వేస్తోంది.

చోడవరం మండలం జి.జగన్నాథపురంలో వ్యవసాయ పనుల్లో రైతులు (ఫైల్‌)

- జిల్లాలో 1.87 లక్షల ఎకరాల్లో సాగు

- 24,112 క్వింటాళ్ల విత్తనాలు అవసరం

- వ్యవసాయ శాఖ ముందస్తు ప్రణాళిక

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

జిల్లా వ్యవసాయశాఖ ఖరీఫ్‌ ప్రణాళిక సిద్ధం చేసింది. విత్తనాల నుంచి ఎరువుల వరకు ఎంత మేరకు అవసరమనే దానిపై అధికారులు అంచనాలు వేశారు. గత వైసీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసింది. కేవలం పెట్టుబడి నిధి విడుదల చేసి చేతులు దులుపుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత స్వర్ణాంధ్ర విజన్‌-2047 ప్రణాళికతో ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా 2025-26 సంవత్సరంలో ప్రధాన పంటలైన వరి, అపరాలు, నువ్వుల సాగు విస్తీర్ణం పెంచడమే కాకుండా పంట దిగుబడులు పెంచేందుకు ప్రణాళికతో అడుగులు వేస్తోంది.

ఈ ఏడాది జిల్లాలో ఖరీఫ్‌ సాగు ఆశాజనకంగా ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఇటీవల కాలంలో జిల్లా వ్యాప్తంగా అడపా దడపా కురుస్తున్న వర్షాలు ఖరీఫ్‌ పంటల సాగుకు కొంత వరకు మేలు చేస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాలో పలు మండలాల్లో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. కొన్ని చోట్ల దుక్కులు మొదలు పెట్టారు. జిల్లాలో 24 మండలాల పరిధిలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో సుమారు 1.87 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రధాన పంటలైన వరి, అపరాలు, నువ్వుల సాగు విస్తీర్ణంతో పాటు దిగుబడులను పెంచాలని నియోజకవర్గాల వారీగా వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో 1.45 లక్షల ఎకరాల్లో వరి, 35 వేల ఎకరాల్లో చిరు ధాన్యాలు, 6,732 ఎకరాల్లో నువ్వులు సాగు చేపట్టనున్నట్టు అధికారులు ప్రాథమిక అంచనా నివేదికలు తయారు చేశారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు పండించే వివిధ రకాల పంటలకు 24,112 క్వింటాళ్ల విత్తనాలు రాయితీపై అందించనున్నారు. పచ్చిరొట్ట విత్తనాలు 893 క్వింటాళ్లు, వరి విత్తనాలు 23,109 క్వింటాళ్లు, రాగులు 2 క్వింటాళ్లు, అపరాలు 84 క్వింటాళ్లు, నువ్వులు 20 క్వింటాళ్లు, చిరు ధాన్యాలు 4 క్వింటాళ్లు సరఫరా చేసేందుకు ఇండెంట్‌ పెట్టారు.

రాయితీపై పచ్చిరొట్ట ఎరువులు

ఎరువుల వినియోగం తగ్గించి, భూసారాన్ని పెంచేందుకు రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేయనున్నారు. నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ న్యూట్రీషన్‌ మిషన్‌ గ్రామ విత్తనాభివృద్ధి పథకం కింద ఎనిమిదేళ్ల లోపు వరి విత్తనాలను 305 ఎకరాల్లో అభివృద్ధి చేసేందుకు వివిధ పరిశోధన కేంద్రాల నుంచి విత్తనాలు సేకరించి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంటీయూ 1224, ఎంటీయూ 1262, ఎంటీయూ 1318, బీపీటీ 2856 రకం వరి విత్తనాలు 50 శాతం రాయితీపై లేదా క్వింటాకు రూ.2,200 కు సరఫరా చేయనున్నారు. ఖరీఫ్‌ పంటల సాగు చేపట్టిన రైతుల కోసం 35,353 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. ఖరీఫ్‌ సాగు చేపట్టే రైతులకు జిల్లాలో అన్ని మండలాల్లో రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ శాఖ సిబ్బంది అందుబాటులో ఉండి, సూచనలు, సలహాలు అందిస్తారని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి బి.మోహన్‌రావు తెలిపారు.

Updated Date - May 21 , 2025 | 12:51 AM