ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జోరుగా అనాస, పనస విక్రయాలు

ABN, Publish Date - Jun 17 , 2025 | 11:18 PM

ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగికి సమీపంలో ఉన్న చిట్రాళ్లగొప్పు ఉద్యాన పంటల మార్కెట్‌లో అనాస, పనస పండ్ల విక్రయాలు ఊపందుతున్నాయి. ఈ ఏడాది గిరిజన ప్రాంతం నుంచి అనాస, పనస ఎగుమతులు పెరిగాయి. దీంతో పండ్లకు గిరాకీ పెరిగింది.

చిట్రాళ్లగొప్పు దుకాణంలో విక్రయానికి ఉంచిన అనాస, పనస పండ్లు

చిట్రాళ్లగొప్పు మార్కెట్‌లో ఊపందుకున్న అమ్మకాలు

ధరలు పెరగడంతో రైతులు హర్షం

చింతపల్లి, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగికి సమీపంలో ఉన్న చిట్రాళ్లగొప్పు ఉద్యాన పంటల మార్కెట్‌లో అనాస, పనస పండ్ల విక్రయాలు ఊపందుతున్నాయి. ఈ ఏడాది గిరిజన ప్రాంతం నుంచి అనాస, పనస ఎగుమతులు పెరిగాయి. దీంతో పండ్లకు గిరాకీ పెరిగింది. పనస కాయ పరిమాణం ఆధారంగా రైతులకు రూ.80 నుంచి రూ.150, అనాస రూ.20 నుంచి రూ.25 ధర లభిస్తోంది. గత ఐదేళ్ల తరువాత మార్కెట్‌ ప్రారంభంలోనే అనాస, పనస పండ్లకు మంచి ధర రావడంతో గిరిజన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చింతపల్లి, జీకేవీధి మండలాల్లో ఆదివాసీ రైతులు సంప్రదాయ పంటగా అనాస, పనస సాగు చేస్తున్నారు. ప్రతి ఏడాది జూన్‌ నుంచి ఆగస్టు వరకు అనాస, పనస దిగుబడులు వస్తాయి. రెండు మండలాలకు చెందిన గిరిజన రైతులు అనాస, పనస పండ్లను చిట్రాళ్లగొప్పు మార్కెట్‌కి తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. మార్కెట్‌కి వచ్చిన అనాస, పనస పండ్లను వర్తకులు కొనుగోలు చేసి భద్రాచలం, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. మార్కెట్‌లో వారం రోజులపాటు పండ్లు విక్రయిస్తుంటారు. సోమవారం, గురువారం, శుక్రవారం గిరిజనులు అధిక మొత్తంలో మార్కెట్‌కి తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. రైతుల వద్ద వర్తకులు గంపగుత్తగా పండ్లను కొనుగోలు చేస్తారు. అయినప్పటికి రైతులు ఆశించిన గరిష్ఠ ధర లభిస్తున్నది.

దుకాణాల్లో విక్రయం

చిట్రాళ్లగొప్పు మార్కెట్‌లో వర్తకులు దుకాణాల వద్ద ప్రతి రోజు అనాస, పనస విక్రయాలు సాగిస్తున్నారు. ఈ దుకాణాల్లో రైతులు విక్రయించిన ధర కంటే రూ.30 నుంచి రూ.50 ధర అధికంగా ఉంటుంది. చిట్రాళ్లగొప్పు మార్కెట్‌ మీదుగా ప్రయాణించే పర్యాటకులు, ప్రయాణికులు దుకాణాల్లో విక్రయించే పండ్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ దుకాణాల్లో రూ.100కు మూడు అనాస, రూ.100 నుంచి 200 వరకు పనస పండ్లు విక్రయిస్తున్నారు. రైతుల నుంచి నేరుగా పనస, అనాస పండ్లు కొనుగోలు చేయాలంటే సోమ, గురు, శుక్రవారాల్లో అందుబాటులో వుంటాయి.

Updated Date - Jun 17 , 2025 | 11:18 PM