ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

93.55% మందికి పింఛన్లు పంపిణీ

ABN, Publish Date - Aug 02 , 2025 | 12:50 AM

జిల్లాలో 1,60,778 మందికిగాను శుక్రవారం 1,50,448 మందికి (93.55 శాతం) పింఛన్లు పంపిణీ చేశారు.

భీమునిపట్నం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో 1,60,778 మందికిగాను శుక్రవారం 1,50,448 మందికి (93.55 శాతం) పింఛన్లు పంపిణీ చేశారు. నగరంలో 1,34,090 మందికిగాను 1,25,245 మందికి, నాలుగు గ్రామీణ మండలాల్లో 26,688 మందికి గాను 25,134 మందికి పింఛన్లు అందజేశారు.


మూడో ఉచిత సిలిండర్‌...

అర్హులైనవారంతా బుక్‌ చేసుకోవచ్చు

నవంబరు నెలాఖరు వరకూ అవకాశం

మొదటి రెండు దశల్లో 97.17 శాతం మంది వినియోగం

విశాఖపట్నం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి):

దీపం-2 పథకం కింద అర్హులైన గ్యాస్‌ వినియోగదారులకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని కూటమి ఎన్నికల సమయంలో ప్రకటించింది. ఆ మేరకు ఇప్పటికి రెండుసార్లు పంపిణీ చేసింది. మూడో దశ బుకింగ్‌ శుక్రవారం నుంచి మొదలైంది. జిల్లాలో 3.77 లక్షల మంది అర్హులు ఉన్నారు. వీరంతా మూడో విడత ఉచిత సిలిండర్‌ శుక్రవారం నుంచి నవంబరు నెలాఖరు వరకూ బుక్‌ చేసుకోవచ్చు. లబ్ధిదారుల ఖాతాలకు డబ్బులు జమ అవుతాయి. గత ఏడాది ఈ పథకం ప్రారంభించినప్పుడు జిల్లాలో 3,77,696 మంది లబ్ధిదారులు ఉండగా వారిలో 3,70,549 మంది (98.1 శాతం) ఉచిత సిలిండర్‌ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. వారి ఖాతాలకు రూ.29.36 కోట్లు జమ చేశారు. రెండో విడత ఈ ఏడాది ఏప్రిల్‌లో జిల్లాలో వినియోగదారులు 3,71,932 మంది కాగా వారిలో 3,58,007 (96.25 శాతం) మంది సిలిండర్లు బుక్‌ చేసుకోగా, రూ.29.92 కోట్లు జమ అయ్యింది. మొదటి, రెండో విడత కలిపి 97.17 శాతం మంది వినియోగించుకున్నారు. కాగా మూడో విడతలో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని లబ్ధిదారులంతా వినియోగించుకోవాలని జిల్లా పౌర సరఫరాల అధికారి వి.భాస్కర్‌ తెలిపారు.


కానిస్టేబుల్‌ ఫలితాలు విడుదల

విశాఖపట్నం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి):

కానిస్టేబుళ్ల నియామకానికి నిర్వహించిన ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,100 పోస్టులను భర్తీ చేసేందుకు సుమారు మూడేళ్ల కిందట ప్రక్రియను ప్రారంభించగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత శారీరక, దేహదారుఢ్య, మెయిన్స్‌ పరీక్షలను నిర్వహించడం ద్వారా పూర్తి చేసింది. ఈ ఫలితాల్లో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఎంతోమంది సత్తా చాటి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. తమ కల ఎట్టకేలకు నిజం అయ్యిందంటూ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు ఆనందాన్ని వ్యక్తంచేశారు.


సంక్షేమ హాస్టళ్లు కళకళ

బీసీ, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలోభారీగా చేరిన విద్యార్థులు

పీజీ, డిగ్రీ ప్రవేశాలు ప్రారంభమైతే మరింత మంది పెరిగే అవకాశం

విశాఖపట్నం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు కళకళలాడుతున్నాయి. బీసీ, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు భారీ సంఖ్యలో చేరారు. ఒక్కో వసతి గృహంలో 50 నుంచి 80 మందికిపైగా విద్యార్థులు చేరారు. డిగ్రీ, పీజీ ప్రవేశాలు ప్రారంభమైన తరువాత మరింత మంది వసతి గృహాల్లో చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 23 హాస్టళ్లు ఉండగా, వీటిలో ఎనిమిది ప్రీ మెట్రిక్‌, ఐదు పోస్టు మెట్రిక్‌ హాస్టళ్లు. ఈ హాస్టళ్లలో ప్రస్తుతం 2,067 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 814 మంది ఈ ఏడాది చేరినవారు. అలాగే బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 28 వసతి గృహాలు ఉండగా, వీటిలో 12 ప్రీ మెట్రిక్‌, 16 పోస్టు మెట్రిక్‌ హాస్టళ్లు. ప్రీ మెట్రిక్‌ వసతి గృహాల్లో 2,067 మంది, పోస్టు మెట్రిక్‌ హాస్టళ్లలో 2,591 మంది విద్యార్థులు ఉన్నారు. సుమారు 900 మంది ఈ ఏడాది కొత్తగా చేరినట్టు అధికారులు వెల్లడించారు. డిగ్రీ, పీజీ ప్రవేశాలు ప్రారంభమైతే మరో 600 నుంచి 700 మంది వరకూ చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.

Updated Date - Aug 02 , 2025 | 12:50 AM