పక్కాగా స్టూడెంట్స్ ‘ఎన్‌రోల్‌మెంట్ స్పెషల్ డ్రైవ్’
ABN, Publish Date - Jun 25 , 2025 | 10:41 PM
పాఠశాలల్లో స్టూడెంట్స్ ఎన్‌రోల్‌మెంట్ స్పెషల్ డ్రైవ్‌ను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు.
విద్యాశాఖాధికారులకు కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశం
పాడేరు, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో స్టూడెంట్స్ ఎన్‌రోల్‌మెంట్ స్పెషల్ డ్రైవ్‌ను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో స్టూడెంట్స్ ఎన్‌రోల్‌మెంట్ స్పెషల్ డ్రైవ్‌కు సంబంఽధించిన బ్యానర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 12వ తేదీన మొదలైన స్పెషల్ డ్రైవ్ జూలై 13వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. బడిఈడు బాలలను విధిగా పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ డ్రాపవుట్స్, బాలలు బడికి దూరంగా ఉండకూడదన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ ఎ.స్వామినాయుడు, జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజిరావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఎల్.రజని, కమ్యూనిటీ మొబలైజేషన్ ఆఫీసర్ ఒ.ప్రకాశ్ పాల్గొన్నారు.
Updated Date - Jun 25 , 2025 | 10:41 PM