కేజీహెచ్‌లో అధ్వానంగా ఆక్సిజన్ ప్లాంట్లు
ABN, Publish Date - Jun 04 , 2025 | 12:59 AM
కరోనా తొలి, మలి దశల్లో ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.
నాలుగేళ్ల నుంచి నిర్వహణ నిల్
వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్లాంట్లను సిద్ధం చేయాలని పైనుంచి ఆదేశాలు
విశాఖపట్నం, జూన్ 3 (ఆంధ్రజ్యోతి):
కరోనా తొలి, మలి దశల్లో ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అటువంటి పరిస్థితి పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటుచేశాయి. ఈ క్రమంలోనే కేజీహెచ్‌లో కూడా ఆరు ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. ఒక్కొక్క దానికి రూ.87 లక్షల చొప్పున ఆరింటికి రూ.5.22 కోట్లు వెచ్చించారు. ఒక్కో యూనిట్‌లో నిమిషానికి వేయి లీటర్లు ఆక్సిజన్ తయారుచేసే సామర్థ్యం కలిగిన యంత్రాలను ఏర్పాటుచేశారు. అయితే వైరస్ తగ్గుముఖం పట్టిన తరువాత వాటి నిర్వహణను ఆస్పత్రి అధికారులు పూర్తిగా గాలికి వదిలేశారు. ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశాలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం మూడు ప్లాంట్లు పనిచేయడం లేదని చెబుతున్నారు.
Updated Date - Jun 04 , 2025 | 12:59 AM