ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరి మృతి

ABN, Publish Date - Aug 04 , 2025 | 11:42 PM

మండలంలోని కుమారపురం గ్రామానికి చెందిన వ్యకి ్త ఆదివారం రాత్రి కాకినాడ జిల్లా తుని సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.

చుక్కా గోపాల్‌రెడ్డి

పాయకరావుపేట రూరల్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కుమారపురం గ్రామానికి చెందిన వ్యకి ్త ఆదివారం రాత్రి కాకినాడ జిల్లా తుని సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఇతని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... కుమారపురానికి చెందిన చుక్కా గోపాల్‌రెడ్డి(48) తునిలో ఒక ప్రైవేటు సంస్థ తరపున ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా తుని పట్టణంలోని వీరవరపుపేట వద్ద కుక్కలు అడ్డుగా వచ్చాయి. దీంతో వాహనం అదుపుతప్పి కిందపడిపోవడంతో గోపాల్‌రెడ్డి తలకు బలమైన గాయం అయ్యింది. చికిత్స నిమిత్తం తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు. తుని పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Updated Date - Aug 04 , 2025 | 11:42 PM