నూకాంబిక జాతర ఆదాయం రూ.1.16 కోట్లు
ABN, Publish Date - May 03 , 2025 | 12:47 AM
నూకాంబిక అమ్మవారి జాతర ఆదాయం గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది పెరిగిందని ఉత్సవ ప్రత్యేకాధికారి కె.శోభారాణి తెలిపారు. ఆమె శుక్రవారం ఇక్కడ ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను, ఈవో వెంపలి రాంబాబు, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నెల రోజుల ఉత్సవంలో టికెట్లు, ప్రసాదాల విక్రయాలు, విరాళాల రూపంలో ఈ నెల రోజుల్లో రూ.1,16,01,987 ఆదాయం వచ్చిందన్నారు. గత ఏడాది ఇదే సమయంలో రూ.89,62,827 ఆదాయం మాత్రమే వచ్చిందని చెప్పారు.
గత ఏడాదితో పోలిస్తే రూ.26.39 లక్షలు అధికం
అందరి సహకారంతో ప్రశాంతంగా ముగిసిన జాతర
ఉత్సవ ప్రత్యేకాధికారి కె.శోభారాణి
అనకాపల్లి టౌన్, మే 2 (ఆంధ్రజ్యోతి): నూకాంబిక అమ్మవారి జాతర ఆదాయం గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది పెరిగిందని ఉత్సవ ప్రత్యేకాధికారి కె.శోభారాణి తెలిపారు. ఆమె శుక్రవారం ఇక్కడ ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను, ఈవో వెంపలి రాంబాబు, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నెల రోజుల ఉత్సవంలో టికెట్లు, ప్రసాదాల విక్రయాలు, విరాళాల రూపంలో ఈ నెల రోజుల్లో రూ.1,16,01,987 ఆదాయం వచ్చిందన్నారు. గత ఏడాది ఇదే సమయంలో రూ.89,62,827 ఆదాయం మాత్రమే వచ్చిందని చెప్పారు. ఈ ఏడాది 15 రోజులకు హుండీ ఆదాయం రూ.41,51,973 రాగా, గత ఏడాది 76 రోజులకు రూ.66,69,415 ఆదాయం లభించిందన్నారు. ఈ ఏడాది మరోమారు హుండీ లెక్కింపు చేపట్టాల్సి ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను ప్రశాంతంగా నిర్వహించామన్నారు. ఈ ఏడాది అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నెల రోజులపాటు ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో 3,200 మంది కళాకారులు తమ కళలను ప్రదర్శించారని చెప్పారు. ఇందుకు అయిన ఖర్చునంతటినీ కొణతాల రామకృష్ణ భరించారని చెప్పారు.
Updated Date - May 03 , 2025 | 12:47 AM