ఎన్టీఆర్ భరోసా పింఛన్ సొమ్ము ఒక రోజు ముందే పంపిణీ
ABN, Publish Date - May 31 , 2025 | 12:50 AM
జూన్ ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఎన్టీఆర్ భరోసా పింఛన్ డబ్బులను ఒకరోజు ముందే... శనివారం పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్టు డీఆర్‌డీఏ పీడీ శచీదేవి తెలిపారు. జిల్లాలో2,54,962 మందికి రూ.107.46 కోట్లు పంపిణీ చేయడానికి నిధులు విడుదల అయ్యాయని, సచివాలయాల సిబ్బంది శనివారం ఉదయం ఆరు గంటల నుంచే పింఛన్లు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. ఈ నెలలో కొత్తగా మంజూరైన 3,168 మందికి జూన్ 12న పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తామని తెలిపారు.
అనకాపల్లి, మే 31 (ఆంధ్రజ్యోతి): జూన్ ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఎన్టీఆర్ భరోసా పింఛన్ డబ్బులను ఒకరోజు ముందే... శనివారం పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్టు డీఆర్‌డీఏ పీడీ శచీదేవి తెలిపారు. జిల్లాలో2,54,962 మందికి రూ.107.46 కోట్లు పంపిణీ చేయడానికి నిధులు విడుదల అయ్యాయని, సచివాలయాల సిబ్బంది శనివారం ఉదయం ఆరు గంటల నుంచే పింఛన్లు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. ఈ నెలలో కొత్తగా మంజూరైన 3,168 మందికి జూన్ 12న పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తామని తెలిపారు.
Updated Date - May 31 , 2025 | 12:50 AM