చిలుకలు కావు.. పుష్పాలు
ABN, Publish Date - Jun 11 , 2025 | 11:44 PM
ఎరుపు, ఆకుపచ్చ వర్ణంలో ఒకదాని వెనుక ఒకటి నిల్చోబెట్టిన చిలుకల వలే కనిపిస్తున్న ఈ పుష్పాలు చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో కనువిందు చేస్తున్నాయి.
కనువిందు చేస్తున్న హెల్కోనియా
చింతపల్లి, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): ఎరుపు, ఆకుపచ్చ వర్ణంలో ఒకదాని వెనుక ఒకటి నిల్చోబెట్టిన చిలుకల వలే కనిపిస్తున్న ఈ పుష్పాలు చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో కనువిందు చేస్తున్నాయి. ఈ పుష్పాలను హెల్కోనియా అని పిలుస్తారు. ఇవి అరటి జాతికి చెందిన మొక్కలు. ప్రతి ఏటా జూన్ నుంచి సెప్టెంబరు వరకు హెల్కోనియా పుష్పాలు పూస్తాయి. పుష్పం కోసిన నెల రోజుల వరకు తాజాగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాల్లో అలంకరణ, బొకేల్లో ఈ పుష్పాలను ఉపయోగిస్తారని, గిరిజన ప్రాంత వాతావరణం హెల్కోనియాకు అత్యంత అనుకూలమని స్థానిక ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త చెట్టి బిందు తెలిపారు. ప్రస్తుతం ఈ హెల్కోనియా వద్ద సందర్శకులు ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు.
Updated Date - Jun 11 , 2025 | 11:44 PM