మునిసిపల్ వైస్‌చైర్మన్లపై అవిశ్వాస నోటీసు తిరస్కరణ
ABN, Publish Date - May 17 , 2025 | 12:50 AM
మునిసిపల్ వైస్‌చైర్మన్లపై 16 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటిస్తూ ఇటీవల ఇచ్చిన నోటీసును జిల్లా కలెక్టర్ శుక్రవారం తిరస్కరించినట్టు మునిసిపల్ కమిషనర్ ప్రసాదరాజు తెలిపారు. మునిసిపల్ వైస్ చైర్మన్లు బెజవాడ వెంకట గోవిందరాజు నాగేశ్వరరావు, ఆర్రెపు నాగ త్రినాథ ఈశ్వర గుప్తాలపై అవిశ్వాసం ప్రకటిస్తూ, చైర్‌పర్సన్ రమాకుమారితోపాటు 16 మంది కౌన్సిలర్ల సంతకాలతో ఈ నెల 9వ తేదీన మునిసిపల్ కమిషనర్‌కు నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.
కలెక్టర్ నిర్ణయం తీసుకున్నట్టు కమిషర్ వెల్లడి
ఎలమంచిలి, మే 16 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ వైస్‌చైర్మన్లపై 16 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటిస్తూ ఇటీవల ఇచ్చిన నోటీసును జిల్లా కలెక్టర్ శుక్రవారం తిరస్కరించినట్టు మునిసిపల్ కమిషనర్ ప్రసాదరాజు తెలిపారు. మునిసిపల్ వైస్ చైర్మన్లు బెజవాడ వెంకట గోవిందరాజు నాగేశ్వరరావు, ఆర్రెపు నాగ త్రినాథ ఈశ్వర గుప్తాలపై అవిశ్వాసం ప్రకటిస్తూ, చైర్‌పర్సన్ రమాకుమారితోపాటు 16 మంది కౌన్సిలర్ల సంతకాలతో ఈ నెల 9వ తేదీన మునిసిపల్ కమిషనర్‌కు నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఈ నోటీసును జిల్లా కలెక్టర్ ఆమోదం కోసం పంపారు. అయితే ఆ సమయంలో కలెక్టర్ సెలవులో వున్నారు. ఆమె శుక్రవారం తిరిగి విధుల్లో చేరిన తరువాత నోటీసులో వున్న కౌన్సిలర్ల పేర్లు, సంతకాలను పరిశీలించారు. నోటీసు అసంపూర్తిగా వుందని, సంతకాల్లో కూడా తేడాలు వున్నాయని భావించిన కలెక్టర్.. అవిశాస నోటీసును తిరస్కరించారు. ఈ మేరకు మునిసిపల్ కమిషనర్‌కు సమాచారం అందింది.
Updated Date - May 17 , 2025 | 12:50 AM