ఏటికొప్పాక బొమ్మలకు జాతీయ అవార్డు
ABN, Publish Date - Jul 15 , 2025 | 12:40 AM
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ఏటికొప్పాక బొమ్మలకు అరుదైన గౌరవం దక్కింది. జాతీయ స్థాయి అవార్డు లభించింది.
అనకాపల్లి కలెక్టరేట్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ఏటికొప్పాక బొమ్మలకు అరుదైన గౌరవం దక్కింది. జాతీయ స్థాయి అవార్డు లభించింది. సోమవారం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’ (ఓడీఓపీ) అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా చేతుల మీదుగా కలెక్టర్ విజయకృష్ణన్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏటికొప్పాక లక్కబొమ్మలు జాతీయస్థాయిలో గుర్తింపు పొందాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత శాఖ మంత్రి సవిత, కమిషనర్ జి.రేఖారాణి, ఏపీ పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 15 , 2025 | 12:40 AM