రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో నాగజ్యోతి సత్తా
ABN, Publish Date - Jul 29 , 2025 | 01:02 AM
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో బంగారు పతకాలు గెలుచుకున్న పవర్ లిఫ్టర్, క్రీడాకారిణి నాగజ్యోతి మరోసారి తన చాటారు.
రోలుగుంట, జూలై 28(ఆంధ్రజ్యోతి): జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో బంగారు పతకాలు గెలుచుకున్న పవర్ లిఫ్టర్, క్రీడాకారిణి నాగజ్యోతి మరోసారి తన చాటారు. ఈ నెల 26, 27 తేదీల్లో గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు జడ్పీ పాఠశాలలో అమరావతి పవర్ లిఫ్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో నాగజ్యోతి మూడు బంగారు పతకాలు సాధించారు. ఈ పోటీల్లో వివిధ జిల్లాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. నాగజ్యోతి 74 కేజీల విభాగంలో స్వ్వాట్, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్ విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి మూడు బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా రోలుగుంట జడ్పీ పాఠశాల హెచ్‌ఎం శేషగిరిరావు, ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు.
Updated Date - Jul 29 , 2025 | 01:02 AM