ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ముత్యాలమ్మ జాతర భక్తులతో కిటకిట

ABN, Publish Date - Apr 26 , 2025 | 11:41 PM

ముత్యాలమ్మ జాతర పురస్కరించుకుని చింతపల్లి భక్తులతో కిటకిటలాడుతోంది.

అమ్మవారికి పూజలు చేస్తున్న భక్తులు

సంప్రదాయ నృత్య ప్రదర్శనలతో అమ్మవారి పాదాలు ఊరేగింపు

నేడు అనుపోత్సవం

చింతపల్లి, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ముత్యాలమ్మ జాతర పురస్కరించుకుని చింతపల్లి భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం మూడో రోజు కావడంతో పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలి వచ్చారు. దీంతో ఉదయం ఆరు గంటల నుంచే అమ్మవారి ఆలయం భక్తులతో రద్దీగా కనిపించింది. అమ్మవారికి స్థానిక భక్తులు ఊరేగింపు సారెను తీసుకొచ్చి సమర్పించారు. భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి వరకు అమ్మవారి దర్శనానికి భక్తులు ఆలయానికి వస్తున్నారు.

పట్టణ వీధుల్లో అమ్మవారి పాదాలు ఊరేగింపు

సంప్రదాయంలో భాగంగా శుక్రవారం శతకంపట్టు వద్దకు తీసుకొచ్చి ప్రతిష్ఠించిన అమ్మవారి పాదాలు(గరగలు) శనివారం సాయంత్రం నుంచి మరుసటి రోజు ఉదయం నాలుగు గంటల వరకు గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. గిరిజన సంప్రదాయ నృత్య కళాప్రదర్శనలు, డప్పు వాయిద్యాలతో అమ్మవారి పాదాలను ఊరేగించారు.

రద్దీగా ప్రధాన రహదారి, వినోద వేదికలు..

చింతపల్లి ప్రధాన రహదారి, వినోద వేదికల వద్దకు వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో రద్దీగా కనిపిస్తున్నాయి. సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం నాలుగు గంటల వరకు ప్రధాన రహదారులు, వినోద వేదికలు జనంతో కిటకిటలాడుతున్నాయి. మార్కెట్‌ వీధి నుంచి హనుమాన్‌ జంక్షన్‌ వరకు రెండు కిలోమీటర్ల ప్రధాన రహదారి పూర్తిగా జనంతో నిండిపోతుంది. ప్రధానంగా ఎగ్జిబిషన్‌, దుకాణాలు, మూడు వినోద వేదికల్లోనూ ప్రజలు అధికంగా కనిపిస్తున్నారు.

ఆదివారం అమ్మవారి అనుపోత్సవం

అమ్మవారి అనుపోత్సవం ఆదివారం జరగనుంది. జాతర ఆఖరిరోజు కావడంతో సుర్లవారి స్థావరాల నుంచి అమ్మవారి పాదాలను భారీ ఊరేగింపుతో అమ్మవారి ఆలయానికి తీసుకొస్తారు. ఈ అనుపోత్సవాన్ని స్వయంగా వీక్షించేందుకు వీఐపీలు, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు.

Updated Date - Apr 26 , 2025 | 11:41 PM