ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇంక్యుబేషన్‌ కేంద్రం పనుల్లో కదలిక

ABN, Publish Date - May 07 , 2025 | 12:30 AM

స్థానిక ఆచార్య ఎన్టీ రంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో చెరకు, చిరుధాన్యాలు, పనస ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ కోసం ఏర్పాటైన కామన్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌లో (అంకుర కేంద్రం) ఎట్టకేలకు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. 2.5 కోట్ల రూపాయలతో యంత్రాలు, ఇతర వనరులు సమకూర్చుకునేందుకు టెండర్ల ప్రక్రియ మొదలయ్యింది. కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ ‘ఒక జిల్లా- ఒక ఉత్పత్తి’ కార్యక్రమం కింద ఈ కేంద్రం ఏర్పాటుకు రెండేళ్ల కిందట రూ.3.5 కోట్లు మంజూరు చేసింది.

ఆర్‌ఏఆర్‌ఎస్‌లో ఇంక్యుబేషన్‌ కేంద్రం

యంత్రాలు, ఇతర వనరుల కోసం రూ.2.5 కోట్లతో టెండర్లు

బెల్లం, చిరుధాన్యాలు, పనస ఉత్పత్తుల ప్రాసెసింగ్‌

అనకాపల్లి అగ్రికల్చర్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఆచార్య ఎన్టీ రంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో చెరకు, చిరుధాన్యాలు, పనస ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ కోసం ఏర్పాటైన కామన్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌లో (అంకుర కేంద్రం) ఎట్టకేలకు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. 2.5 కోట్ల రూపాయలతో యంత్రాలు, ఇతర వనరులు సమకూర్చుకునేందుకు టెండర్ల ప్రక్రియ మొదలయ్యింది. కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ ‘ఒక జిల్లా- ఒక ఉత్పత్తి’ కార్యక్రమం కింద ఈ కేంద్రం ఏర్పాటుకు రెండేళ్ల కిందట రూ.3.5 కోట్లు మంజూరు చేసింది. వి ఇందులో కోటి రూపాయల వ్యయంతో ఇంక్యుబేషన్‌ కేంద్ర భవనం నిర్మించారు. ఇక్కడ బెల్లం విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, ప్రాసెసింగ్‌, ఇంకా చిరు ధాన్యాలు, పనస ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ నిర్వహిస్తారు. బెల్లం ప్రాసెసింగ్‌ లైన్‌కు రూ.1.37 కోట్లు, చిరుధాన్యాల ప్రాసెసింగ్‌ ఏర్పాట్లకు రూ.66 లక్షలు, పనస ఉత్పత్తులకు రూ.25 లక్షలు ఖర్చు చేస్తారు. ఆహార పరీక్ష ప్రయోగశాలను రూ.25 లక్షలతో ఏర్పాటు చేస్తారు. ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ద్వారా రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వ్యవస్థాపకులకు వాణిజ్యపరంగా ఉపయోగపడేలా సహకారం అందిస్తారు. రైతులు, వ్యవస్థాపకులకు ఆహార ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌లపై శిక్షణ ఇస్తారు. నామమాత్రపు రుసుముతో ఇక్కడ అన్ని విధాలా ప్రోత్సాహం అందుతుందని పంటకోత అనంతరం సాంకేతిక ఇంజనీరింగ్‌ విభాగం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్‌ పి.వి.కె.జగన్నాఽథరావు, డాక్టర్‌ శ్రీదేవి తెలిపారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగం అభివృద్ధికి పలు నిర్ణయాలు తీసుకుంది. టమాటా, మామిడి ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై శిక్షణ, మార్కెటింగ్‌ కార్యక్రమాలను రూపొందిస్తున్నది.

Updated Date - May 07 , 2025 | 12:30 AM