ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బ్యాంకుల వద్ద తల్లుల సందడి

ABN, Publish Date - Jun 16 , 2025 | 11:41 PM

జిల్లాలోని బ్యాంకులు, పోస్టాఫీసులు సోమవారం రద్దీగా కనిపించాయి. రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడం, ప్రతి విద్యార్థికి రూ.13 వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో సొమ్ము జమ చేయడంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా తల్లుల సందడే కనిపిస్తోంది.

పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్‌ రోడ్డులో బ్యాంకు పాయింట్‌ వద్ద విత్‌డ్రాకు బారులు తీరిన తల్లులు

తల్లికి వందనం డబ్బులు విత్‌డ్రాకు బారులుతీరిన వైనం

ఆధార్‌ అప్‌డేట్‌ కోసం పోస్టాఫీసులకు..

జిల్లాలో 1,56,182 మంది అర్హులుగా గుర్తింపు

అర్హత ఉండి ఏదైనా కారణంతో నగదు జమకాకుంటే సచివాలయాల్లో అభ్యంతరాల స్వీకరణ

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని బ్యాంకులు, పోస్టాఫీసులు సోమవారం రద్దీగా కనిపించాయి. రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడం, ప్రతి విద్యార్థికి రూ.13 వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో సొమ్ము జమ చేయడంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా తల్లుల సందడే కనిపిస్తోంది. ఏజెన్సీలో కేవలం మండల కేంద్రాల్లో మాత్రమే బ్యాంకులు, సబ్‌పోస్టాఫీసులు ఉన్నాయి. కాగా తల్లికి వందనం సొమ్ము విత్‌డ్రాలకు తల్లులు మండల కేంద్రాల్లోని బ్యాంకులకు రావడంతో రద్దీగా మారాయి. అలాగే విద్యార్థులు, తల్లుల ఆధార్‌ అప్‌డేట్‌ కోసం పోస్టాఫీసులకు క్యూ కట్టారు.

జిల్లాలో 1,56,182 మంది అర్హులుగా గుర్తింపు

జిల్లాలో రెండో తరగతి నుంచి పదో తరగతి, ఇంటర్‌ రెండో ఏడాది చదువుతున్న లక్షా 56 వేల 182 మంది విద్యార్థులు తల్లికి వందనం పథకానికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. అలాగే 2025- 26 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి, ఇంటర్‌ మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థుల నమోదు ప్రక్రియ అనంతరం వారికి సైతం తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి చేకూర్చనున్నారు. ఈ ఏడాది రెండవ తరగతిలో 18459 మంది, మూడులో 17,737, నాలుగులో 17,104, ఐదులో 15,195, ఆరులో 18,558, ఏడులో 17,166, ఎనిమిదిలో 15,261, తొమ్మిదిలో 14,865, పదవ తరగతిలో 12,636 మంది విద్యార్థులతో పాటు ఇంటర్‌ రెండో సంవత్సరంలో 9,201 మందితో కలిసి మొత్తం జిల్లాలో లక్షా 56 వేల 182 మంది విద్యార్థులను తల్లికి వదనంలో అర్హులుగా గుర్తించారు. దీంతో ఆయా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు జమ చేస్తుండగా, మిగిలిన రూ.2 వేలను పాఠశాలలో పారిశుధ్యం, అభివృద్ధికి వినియోగించనున్నారు.

గ్రామ సచివాలయాల్లో అభ్యంతరాల స్వీకరణ

అర్హత కలిగి ఏదైనా కారణంలో తల్లికి వందనం పథకంలో తల్లుల ఖాతాల్లో సొమ్ము జమకాకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. సంబంధిత గ్రామ సచివాలయానికి వెళ్లి తమ స్థితిగతులను తెలుసుకోవడంతో పాటు నమోదులో ఏదైనా లోపం ఉంటే, దానిని సరిచేయించుకుంటే తల్లికి వందనం సొమ్ము తల్లి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. ఎక్కువగా విద్యార్థి లేదా తల్లి ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ కాకపోవడంతో, బ్యాంకు ఖాతా నంబర్లు లేదా ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లను తప్పుగా నమోదు చేయడం వంటి పొరపాట్ల కారణంగా ఎక్కువ మందికి తల్లికి వందనం పథకంలో సామ్ము జమకావడం లేదని అధికారులు గుర్తించారు. దీంతో ఆయా సమస్యలను సరి చేయాలని మండల స్థాయిలో విద్యాశాఖాఽధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో విద్యాశాఖ పరిధిలోని లోటుపాట్లను వాళ్లు సరి చేస్తుండగా, సచివాలయం స్థాయిలోని వెల్ఫేర్‌ అసిస్టెంట్‌లు వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఉదాహరణకు తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించిన నాటికి జిల్లాలో అర్హులైన మొత్తం లక్షా 56 వేల 182 మందికి గానూ 94 వేల 781 మందికి మాత్రమే తల్లుల ఖాతాల్లో విద్యార్థికి రూ.13 వేలు చొప్పున జమ కాగా, 61,401 మందికి వివిధ కారణాలతో తొలి రోజు సొమ్ము జమ కాలేదు. ఆయా లోటుపాట్లను సరి చేయడంతో వారిలో ఇప్పటికీ 56 వేల 471 మందికి సొమ్ము జమకాగా ఇంకా 4,930 మంది తల్లుల ఖాతాల్లో సొమ్ము జమ కావాల్సి ఉంది. వారికి బుధవారం సాయంత్రంలోగా సొమ్ము జమ అవుతుందని అధికారులు తెలిపారు.

Updated Date - Jun 16 , 2025 | 11:41 PM