ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బడి భోజనం మెనూలో స్వల్ప మార్పులు

ABN, Publish Date - Jun 13 , 2025 | 12:55 AM

పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మెనూలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. గత విద్యా సంవత్సరం భోజన పథకం మెనూలో కొన్ని మార్పులు చేసి తాజాగా మెనూ చార్ట్‌ సిద్ధం చేసి పాఠశాలలకు పంపించింది. వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు తేరవక ముందే ముతక బియ్యం స్థానంలో సన్న బియ్యం సరఫరా చేసింది.

నర్సీపట్నం తురకబడి పాఠశాలలో పిల్లలకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న నిర్వాహకులు

ముతక బియ్యం స్థానంలో సన్న బియ్యం సరఫరా

సాంబార్‌ బాత్‌కు బదులు వైట్‌ రైస్‌, సాంబారు

హాట్‌ పొంగలి/ కూరగాయల పులావ్‌ స్థానంలో వైట్‌ రైస్‌, ఆకుకూర పప్పు

పులిహోర మంగళవారం నుంచి శుక్రవారానికి మార్పు

నర్సీపట్నం, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మెనూలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. గత విద్యా సంవత్సరం భోజన పథకం మెనూలో కొన్ని మార్పులు చేసి తాజాగా మెనూ చార్ట్‌ సిద్ధం చేసి పాఠశాలలకు పంపించింది. వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు తేరవక ముందే ముతక బియ్యం స్థానంలో సన్న బియ్యం సరఫరా చేసింది. ప్రతి గురువారం విద్యార్థులకు సాంబార్‌ బాత్‌ పెట్టేవారు. ఎక్కువ మంది దీనిని తినే వారు కాదు. ఉపాధ్యాయుల నుంచి నివేదిక తెప్పించుకొని సాంబార్‌ బాత్‌ను మెనూ నుంచి తొలగించి దాని స్థానంలో వైట్‌ రైస్‌, సాంబారు చేర్చారు. ప్రతి సోమవారం హాట్‌ పొంగలి లేదా కూరగాయల పులావ్‌ పెట్టేవారు. కొత్త మెనులో సాధారణ వైట్‌ రైస్‌, ఆకుకూర పప్పు చేర్చారు. పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో వారంలో ఐదు రోజులు కోడిగుడ్డు, మూడు రోజులు వేరుశనగ చిక్కిలు, మూడు రోజులు రాగి జావ కొనసాగిస్తున్నారు. ప్రతి మంగళవారం పెట్టే పులిహోరను శుక్రవారానికి మార్చారు.

కొత్త మెనూ...

సోమవారం: వైట్‌ రైస్‌, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కి

మంగళవారం: వైట్‌ రైస్‌, గుడ్డు కూర, రసం, రాగి జావ

బుధవారం: కూరగాయల పులావ్‌, బంగాళా దుంపు కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కి

గురువారం: వైట్‌ రైస్‌, సాంబారు, గుడ్డు కూర, రాగిజావ

శుక్రవారం: పులిహోరా, చట్ని (గోంగూర, విజిటేబుల్‌), ఉడికించిన గుడ్డు, చిక్కి

శనివారం: వైట్‌ రైస్‌, విజిటబుల్‌ కర్రీ, రసం, రాగిజావ, స్వీట్‌ పొంగలి

Updated Date - Jun 13 , 2025 | 12:55 AM