ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి లోకేశ్
ABN, Publish Date - Jun 21 , 2025 | 01:19 AM
అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ శుక్రవారం మధ్యాహ్నం నగరానికి చేరుకున్నారు.
విశాఖపట్నం, జూన్ 20 (ఆంధ్రజ్యోతి):
అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ శుక్రవారం మధ్యాహ్నం నగరానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయన...అక్కడ వేచివున్న పలువురి నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. అనంతరం కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని, సాయంత్రం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానానికి వెళ్లారు. 25 వేల మంది గిరిజన విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేయడం ప్రత్యక్షంగా వీక్షించి అభినందించారు. ఆ తరువాత ఐఎన్‌ఎస్ డేగాకు వెళ్లి ప్రధానమంత్రికి స్వాగతం పలికారు. అక్కడ నుంచి తిరిగి వచ్చి పార్టీ కార్యాలయానికి వచ్చి బస చేశారు.
నేడు జీవీఎంసీ కమిషనర్‌గా కేతన్ గర్గ్ బాధ్యతల స్వీకారం
విశాఖపట్నం, జూన్ 20 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ కమిషనర్‌గా నియమితులైన కేతన్ గర్గ్ శనివారం ఉదయం 10.30 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన రాజమండ్రి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేస్తూ ఇక్కడికి బదిలీపై వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన నగరంలోనే ఉన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో తన వంతు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అధికారికంగా శనివారం విధుల్లో చేరనున్నారు.
Updated Date - Jun 21 , 2025 | 01:19 AM